CEIR: మొబైల్ ఫోన్ల రికవరీలో 11 వేల మైలురాయి దాటిన అనంత పోలీసులు..
CEIR: మొబైల్ ఫోన్ల రికవరీలో 11 వేల మైలురాయి దాటిన అనంత పోలీసులు..
శుక్రవారం రోజు అందజేసిన 1183 ఫోన్లతో కలిపి ఇప్పటి వరకు జిల్లా పోలీసుశాఖ అందజేసిన మొబైల్ ఫోన్లు 11,378... వీటన్నింటి విలువ సుమారు రూ 21.08 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
జిల్లా ఎస్పీ పి.జగదీష్ మార్క్..
సెల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే అనంత పోలీసుల అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన రికవరీ మొబైల్ ఫోన్ల మేళాలో రూ.2.95 కోట్ల విలువ చేసే 1183 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ
ఇక దొరకవని ఆశలు వదలిన సెల్ ఫోన్లను పోలీసుల ద్వారా అందుకున్న బాధితుల్లో వెల్లివిరిసిన ఆనందం... జిల్లా పోలీసు సేవలు పట్ల హర్షం వ్యక్తంచేశారు.
జిల్లా ఎస్పీ పి.జగదీష్ శుక్రవారం రూ. 2.95 కోట్లు విలువ చేసే 1183 సెల్ ఫోన్లను బాధిత ప్రజలకు అందజేశారు.
జిల్లాలో ప్రజల మొబైల్ ఫోన్లు చోరీకు గురై అవి ఇతర రాష్ట్రాలకు చేరినా రికవరీలో రాజీపడని జిల్లా పోలీసులు
❇️ ఇప్పటి వరకు అందజేసిన మొత్తం 11,378 మొబైల్ ఫోన్లలో అనంతపురం జిల్లావాసులకు-7512, శ్రీ సత్య సాయి -1120, కర్నూలు- 614, కడప-412, చిత్తూరు-97, గుంటూరు-87, తిరుపతి-55, నెల్లూరు-53, తూర్పు గోదావరి-38, ప్రకాశం-36, కృష్ణ-35, పశ్చిమ గోదావరి-33, విజయవాడ-28, విజయనగరం-21, కాకినాడ-18, శ్రీకాకుళం-16, ఏలూరు-12, ఒంగోలు-09, విశాఖపట్నం-07... మరియు కర్నాటక -427, తెలంగాణ-389, కేరళ-93, తమిళనాడు-73, మహరాష్ట్ర-60, పశ్చిమ బెంగాల్ - 39, ఉత్తరప్రదేశ్ - 19, బీహార్-15, అస్సాం-13, రాజస్థాన్-11, ఒడిస్సా-09, గుజరాత్-08, మధ్యప్రదేశ్-05, హర్యాన-03, జమ్ము కాశ్మీర్-03, ఛత్తీస్ ఘడ్-02, జార్కండ్-02, డెహ్రాడూన్-01, డిల్లీ-01, పంజాబ్ -01.
❇️ 26-06-2022 వ తేదీన జిల్లా పోలీసుశాఖ చాట్ బాట్ సేవలు ప్రారంభించి చోరీకి గురైనా లేదా మిస్సయిన మొబైల్ ఫోన్ల జాడ కనుక్కొని రికవరీ చేసి ప్రజలకు అందజేయడం ప్రారంభించిన విషయం తెలిసిందే.
❇️ ఇప్పటి వరకు రికవరీ చేసి అందజేసిన 11,378 ఫోన్లలో దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలలోని బాధితులకు ముట్టజెప్పిన ఫోన్లు 1174... మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లా వాసులకు 7,512 ... మిగితా 19 జిల్లాల బాధితులకు అందజేసినవి 2,692 ... రికవరీ చేసి అందజేసిన మొబైల్ ఫోన్లు ధర రూ. 499 నుండీ రూ 1,41,000/- వరకు ఉన్నాయి.
❇️ సెల్ ఫోన్ దుకాణం నిర్వాహకులైనా, వ్యక్తులైనా ఎవరైనా సరే అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయొద్దని ఎస్పీ సూచన
❇️ అమ్మేవారు పరిచయస్తులైనా సరే బిల్లులు, సంబంధిత మొబైల్ ఫోన్ వివరాలు కల్గిన బాక్సు ఉంటేనే కొనండి
❇️ ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, తదితర ప్రదేశాలలో మోసపు మాటలతో నమ్మబలికే వారి పట్ల ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
❇️ అపరిచితులతో ఫోన్ కొనడం వల్ల ఇటు సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు... అటు కొన్న వ్యక్తి కూడా నష్టపోతాడని గుర్తించి దూరంగా ఉండాలి
❇️ మొబైల్ ఫోన్లు తస్కరించే వారిపై ప్రత్యేక నిఘా వేసిన జిల్లా పోలీస్ ... చాట్ బాట్ సేవల ద్వారా బాధితులకు న్యాయం చేస్తున్న అనంత పోలీసులు
❇️ ఫోన్ చోరీకి గురైనా మిస్ అయినా చాట్ బాట్ లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న CEIR ద్వారా నమోదు చేసుకోవాలి.
❇️ CEIR లో ఎలా నమోదు చేసుకోవచ్చో చాట్ బాట్ లో సూచనలు కూడా చేశాం. వెంటనే సిమ్, IMEI నంబర్లను బ్లాక్ చేస్తారు. దీనివల్ల సదరు మొబైల్ నంబర్ , మొబైల్ ఫోన్ లో ఉన్న విలువైన సమాచారం దుర్వినియోగం కాకుండా ఉండే వీలుంటుంది.
❇️ ప్రజలు పోగొట్టుకున్న సెల్ ఫోన్లు జవాబుదారీగా అందించేందుకు కృషి చేసిన జిల్లా పోలీస్ సైబర్ విభాగం సి.ఐ షేక్ జాకీర్ మరియు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ
❇️ బిల్లు లేకుండా సెల్ ఫోన్ అమ్ముతామంటు నమ్మబలికే వ్యక్తులు మరియు సెల్ ఫోన్ దుకాణాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, తదితర ప్రాంతాలలో అనుమానాస్పదంగా సంచరించే వారిపై సమీపంలోని పోలీసు స్టేషన్ కు లేదా డయల్ - 100/112 కు సమాచారం చేరవేయాలని విజ్ఞప్తి చేశారు.
❇️ మీ సెల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకు గురైనా ఈకింద కనపరిచిన లింక్స్ ఓపెన్ చేసి సమాచారం పొందుపరచండి..
1)To report Lost/Theft Mobile
A) Chatbot : https://bit.ly/3yjd0rm
B) https://www.ceir.gov.in/Request/CeirUserBlockRequestDirect.jsp
సైబర్ నేరానికి గురైతే ఈక్రింది కనపరిచిన లింక్ కు లేదా టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయండి...
2) Cyber Crime Complaint www.cybercrime.gov.in
Dial 1930 for cyber complaints