ITCX: ఐటిసిఎక్స్ గురించి క్లుప్తంగా..
ITCX: ఐటిసిఎక్స్ గురించి క్లుప్తంగా..
తిరుపతి, ఫిబ్రవరి17:
టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో 2025 ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు తిరుపతిలోని ఆశ కన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహించుచున్న అంతర్జాతీయ దేవాలయాల సమావేశ ఎక్స్పో కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఆంధప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్. వీరితో పాటు శ్రీపాద్ నాయక్ కేంద్ర సహాయ మంత్రి నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ, తిరుపతి జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రివర్యులు అనగాని సత్య ప్రసాద్, విశ్వజిత్ రాణే, గోవా ఆరోగ్య, అటవీ, పట్టణాభివృద్ధి, స్త్రీ & శిశు అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు, ఆశిష్ షెలార్ సాంకేతిక మరియు సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి మహారాష్ట్ర, రోహన్ ఖౌంటే టూరిజం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ మరియు ప్రింటింగ్ & స్టేషనరీ గోవా మంత్రి, B.R నాయుడు, చైర్మన్ టీటీడీ తదితరులు వేదికపై పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద రావు, ఎంఎల్ఏ లు పూతలపట్టు మురళీ మోహన్, చంద్రగిరి పులివర్తి నాని, నగరి గాలి భాను ప్రకాష్, శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి, పలమనేరు అమర్నాథ్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్, శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, ఆచార్య గోవిందదేవ్ గిరీజీ మహారాజ్ ఆధ్యాత్మిక నాయకులు మరియు పండితులు, సి.ఆర్ ముకుంద జాయింట్ జనరల్ సెక్రటరీ RSS, ప్రసాద్ లాడ్, చైర్మన్ ITCX, MLC మహారాష్ట్ర, గిరేష్ వాసుదేవ్ కులకర్ణి, వ్యవస్థాపకులు - ITCX మరియు టెంపుల్ కనెక్ట్ నీతా లాడ్, ప్రిన్సిపల్ అడ్వైజర్, ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో 2025 & ఫౌండర్ అంత్యోదయ ప్రతిష్ఠాన్ ... ప్రవీణ్ దారేకర్ - మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అలాగే టీటీడీ ఈవో శ్యామల రావు, వినయ చంద్ ఐఏఎస్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, జెసి శుభం బన్సల్, తిరుపతి మునిసిపల్ కమిషనర్ మౌర్య, ఎస్పీ హర్ష వర్ధన్ రాజు, కమిషనర్ దేవాదాయ శాఖ రామచంద్ర తదితరులు హాజరయ్యారు.వేదిక పై ఉన్న ఏపీ, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులకు, మంత్రులకు పలువురికి సముచితంగా సన్మానించారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీ అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్పో తిరుపతి నందు జరుగుతున్న సందర్భంగా హార్దిక అభినందనలు తెలుపుతూ రాసిన లేఖను చదివి వినిపించారు
ఐటిసిఎక్స్ గురించి క్లుప్తంగా:
టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో 2025 ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు తిరుపతిలోని ఆశ కన్వెన్షన్ సెంటర్‌లో అంతర్జాతీయ దేవాలయాల సమావేశం నేడు అంగ రంగ వైభవంగా ప్రముఖుల చేతుల మీదుగ నేటి సోమవారం సాయంత్రం పండుగ వాతావరణంలో ప్రారంభించుకోవడం జరిగింది. దేవాలయాల నిర్వహణలో ఉత్తమ పద్ధతులను తెలియజేసే ఈ ప్రత్యేక జ్ఞాన పంచన కార్యక్రమంలో నిపుణుల నేతృత్వంలో చర్చలు, ప్రదర్శనలు, వర్క్‌షాపులు, మాస్టర్‌క్లాసులు- టెంపుల్ టాక్స్ జరుగనున్నాయి.
ఇందులో ముఖ్య అంశాలు
58 దేశాల నుంచి హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతాల భక్తి సంస్థల ప్రతినిధులు పలువురు ఇందులో పాల్గొననున్నారు.
ITCX ద్వారా 58 దేశాల అంతటా 1581 దేవాలయాలను ఒకే వేదికపై అనుసంధానించడం ఈ కార్యక్రమం ద్వారా జరుగుతోంది. ఈ 3 రోజుల కన్వెన్షన్ నందు స్థిరత్వ మరియు పునరుత్పాదక ఇంధనం, దేవాలయ పాలన మరియు సమ్మతి, దేవాలయ ఆర్థిక వ్యవస్థ, స్మార్ట్ టెంపుల్ పరిష్కారాలు వంటి అంశాలపై సెమినార్లు నిర్వహించడం జరుగుతుంది.