రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

PM KISAN: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ డబ్బులు విడుదల అకౌంట్లో ఇలా చేసుకోండి

pm kisan status check aadhar card pm kisan payment status pm kisan status kyc pm kisan.gov.in registration pm kisan samman nidhi check pm kisan news
Peoples Motivation

PM KISAN: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ డబ్బులు విడుదల అకౌంట్లో ఇలా చేసుకోండి

• రైతులకు శుభవార్త..

• 19వ విడత పీఎం కిసాన్ నిధుల్ని విడుదల చేసిన ప్రధాని..

• అకౌంట్లో చెక్ చేసుకోండిలా!

pm kisan status check aadhar card pm kisan payment status pm kisan status kyc pm kisan.gov.in registration pm kisan samman nidhi check pm kisan news..
PM KISAN: పీఎం కిసాన్ 19వ విడత నిధుల్ని సోమవారం(ఫిబ్రవరి 24న) ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన రూ.22వేల కోట్లతో 9.8 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. బిహార్‌లోని భాగల్‌పుర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ 'పీఎం కిసాన్‌' నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమానికి ఎన్‌డీఏ కూటమి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో? లేదో? ఇలా చెక్ చేసుకోవాలి?

• ముందుగా మీరు www.pmkisan.gov.in

• వెబ్సైట్లోని "Beneficiary List" ఆప్షన్పై క్లిక్ చేయాలి.

• మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలను ఎంచుకోవాలి.

• లబ్ధిదారుల జాబితా కోసం ''Get Report" క్లిక్ చేయాలి. అంతే సింపుల్!

• మీ గ్రామంలోని లబ్ధిదారుల పేర్లు అక్కడ కనిపిస్తాయి. వాటిలో మీ పేరు ఉందో? లేదో? చూసుకోవాలి.

ఈ జాబితాలో పేరు ఉంటే మీకు పీఎం కిసాన్ డబ్బులు పడ్డట్టే. ఆ స్టేటస్ ఇలా తెలుసుకోండి

• పీఎం కిసాన్ బెనిఫీషియరీ స్టేటస్, ఇన్స్టాల్మెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఈ https://pmkisan.gov.in/

• అక్కడ మనకు FARMERS CORNER సెక్షన్ కనిపిస్తుంది.

• అందులో Know Your Status అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి.

• అక్కడ మీ పీఎం కిసాన్‌ రిజిస్ట్రేషన్ నంబర్ను నమోదు చేసి, క్యాప్చా కోడ్ను ఎంటర్‌ చేయాలి.

• ఇప్పుడు Get Data అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే స్క్రీన్పై మీ బెనిషియరీ స్టేటస్ కనిపిస్తుంది.

• ఏ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు పంపించారో కూడా మీకు మెసేజ్ వస్తుంది.

• ఒకవేళ మీకు డబ్బులు పడలేదంటే మీరు ఈ - కేవైసీ చేయించలేదని అర్థం.

ఈ-కేవైసీ తప్పనిసరి..

పీఎం-కిసాన్ నిధి ప్రయోజనం పొందుతున్న రైతులు ప్రస్తుతం విడుదలైన 19వ ఇన్‌స్టాల్‌మెంట్‌తో పాటు ఆ తర్వాతి పేమెంట్లను పొందాలంటే ఈ-కేవైసీని తప్పనిసరిగా పూర్తి చేయాలి. రెండు మార్గాల్లో ఈ-కేవైసీని పూర్తి చేయవచ్చు.

ఓటీపీ విధానంలో ఈ-కేవైసీ:-

• పీఎం-కిసాన్ వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి. (https://pmkisan.gov.in/

• Farmers Corner సెక్షన్ కింద ఉండే ఈ-కేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

• ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ రిజిస్టర్ చేసుకోవాలి.

• మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ:-

• లబ్దిదారులు కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా రాష్ట్ర సేవా కేంద్రానికి వెళ్లాలి.

• ఆధార్ కార్డ్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ చెప్పాల్సి ఉంటుంది.

• సీఎస్‌సీ ఆపరేటర్ లబ్దిదారుల వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్‌ చేసి బయోమెట్రిక్ అథంటికేషన్‌ను పూర్తి చేస్తారు.

• ఈ విధంగా రైతులు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా పీఎం-కిసాన్ నిధి ప్రయోజనాలను పొందవచ్చు.

సందేహం ఉంటే ఇలా..

మీకు ఏదైనా సందేహం ఉన్నా? లేక సాయం కావాలన్నా 155261 లేదా 011-24300606 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.

రైతులకు ఏటా రూ.6,000/-

రైతులకు ఏటా ఒక్కో విడత రూ.2,000 చొప్పున మూడువిడతల్లో రూ.6,000 సాయం అందించే 'పీఎం కిసాన్‌' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది. ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు 18 వాయిదాల్లో రూ.3.46 లక్షల కోట్లు అందజేసింది.

Comments

-Advertisement-