22ఎ నుండి ప్రయివేట్ భూముల తొలగింపు
Andhra pradesh to present budget for 2025-26
Ap budget 2025 26 telugu
AP Budget pdf
AP Budget Highlights
Ap Budget portal
Ap Finance Budget
Ap Budget
By
Peoples Motivation
22ఎ నుండి ప్రయివేట్ భూముల తొలగింపు
గ్రామకంఠంలోని భూములకు కూడా విముక్తి
అభ్యంతరం లేని అక్రమిత భూముల క్రమబద్దీకరణకు ఏడాది పాటు సమయం
శాసనసభలో రాష్ర్ట రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):- పేదలకు, నిజమైన భూ యజమానులకు న్యాయం జరగలానే లక్ష్యంతో 22 ఏ నుండి ప్రయివేట్ భూములను తొలగించాని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ర్ట రెవెన్యూ,రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇందుకోసం గత నెల 17వ తేదీన మెమోను విడుదల చేశామని, నిషేధ ఆస్తుల జాబితా నుండి ప్రయివేట్ భూములను ఎలా తొలగించాలనేది స్పష్టంగా అందులో తెలిపామని చెప్పారు. ఈమేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధాన మిస్తూ అలాగే పంచాయతీల్లో గ్రామ కంఠాల్లో ఉండే ప్రయివేట్ వ్యక్తుల ఆస్తులను కూడా నిషేధ జాబితా నుండి తొలగించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. దీనికి సంబంధించి 2015లోనే అప్పటి కూటమి ప్రభుత్వం 187 జీవోను ఇచ్చిందని, పంచాయతీలకు చెందిన సామాజిక ఆస్తులు మినహా మిగిలిన ఆస్తులను నిషేధ జాబితా నుండి తొలగిస్తూ ఆ జీవో ఇచ్చారని చెప్పారు. అయితే గత ప్రభుత్వం రీ సర్వే చేసిన సందర్భంలో రాష్ర్టవ్యాప్తంగా గ్రామాల్లో 4,157 ఎకరాలను నిషేధ జాబితాలో పెట్టారని, దీని వల్ల సామాన్యులు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఈ నేపథ్యంలో గ్రామ కంఠంలోని ప్రయివేట్ ఆస్తులను పరిశీలించి నిషేధ జాబితా నుండి తొలగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కాగా రాష్ర్ట వ్యాప్తంగా అభ్యంతరం లేని ప్రభత్వ భూములను ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్న వారికి క్రమబద్దీకరణ చేస్తున్నామని, వీరికి ఏడాదిపాటు సమయం ఇచ్చామని, వీరంతా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు. గత ప్రభుత్వం భూముల రీ సర్వేను ఫార్సుగా మార్చిందని, సరిహద్దు రాళ్లపై, పాస్ పుస్తకాలపైన బొమ్మలు వేసుకోవాలనే కాంక్షతో రీ సర్వేను తప్పుల తడకగా మార్చిందని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం భూ యజమానులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో సమగ్రంగా రీసర్వే చేయిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.
Comments