Betting apps: క్రికెట్ బెట్టింగ్ ల జోలికెళ్ళి జీవితాలు నాశనం చేసుకోకండి
Betting apps: క్రికెట్ బెట్టింగ్ ల జోలికెళ్ళి జీవితాలు నాశనం చేసుకోకండి
👉జిల్లాలో క్రికెట్ బెట్టింగు నిర్వాహకులు, పందెంరాయుళ్లపై ప్రత్యేక నిఘా
👉క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవు
-ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్
అమాయక ప్రజలను, యువకులను లక్ష్యంగా చేసుకొని, ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చని ఆశలు రేకెత్తించేలా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ అమాయకులను మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ హెచ్చరించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు జరుగునున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ నిఘా పెట్టడం జరిగిందని, క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడే కొంత మంది వ్యక్తులను గుర్తించడం కూడా జరిగిందన్నారు. క్రికెట్ బెట్టింగులతో సంబంధాలు ఉన్న పాత నేరస్తులను కూడా బౌండోవర్ కేసులు నమోదు చేయటం జరిగిందని, యువత, విద్యార్థులు బెట్టింగ్ జోలికి వెళ్లకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ చట్టవిరుద్ధం, ఇది ఆర్థికంగా, సామాజికంగా జీవితాలను నాశనం చేస్తుందని, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అవి మోసపూరితంగా ఉండవచ్చునని, క్రికెట్ బెట్టింగ్ వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయన్నారు. వినోదం కోసం మాత్రమే క్రికెట్ మ్యాచ్ లు చూడాలని, బెట్టింగులు వైపు మొగ్గు చూపకూడదని, క్రికెట్ బెట్టింగు యాప్ లలో బాల్ టు బాల్ పందేలు వేసే వీలుండటం, ఆకర్షణీయమైన మాటలు నమ్మి అత్యాశకు పోయి జీవితాలు నాశనం చేసుకోకూడని, శ్రమించకుండా వచ్చే నగదు వెనుక అనేక నష్టాలు దాగి ఉంటాయని యువత గుర్తెరగాలని, కేసుల్లో నిందితులుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. యువత, విద్యార్థులు బెట్టింగ్ జోలికి వెళ్లకుండా చదువుపై దృష్టి పెట్టాలని, తమ తల్లిదండ్రుల కోసం ఉన్నతంగా బ్రతకాలని, బెట్టింగ్ రాయుళ్ళ వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు.
అమాయకులను ఆసరాగా చేసుకుని ఎవరైనా డబ్బు ఆశ చూపించి క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఉపేక్షించబోమన్నారు. బెట్టింగ్ వెబ్‌సైట్, యాప్స్ పై నిఘా ఏర్పాటు చేయటం జరిగిందని, నిర్వాహకులను కూడా గుర్తించటం, వారి యొక్క బ్యాంకు అకౌంట్స్ మరియు ప్రాపర్టీ ని కూడా సీజ్ చేయటంతో పాటు ఆ అకౌంట్స్ డబ్బులు బదిలీలను పరిశీలించటం జరుగుతుందన్నారు. ఏ.పి జూద చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అవసరమైతే సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు.
జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే సదరు సమాచారాన్ని డయల్ 112/100 కు లేదా పోలీస్ వాట్సాప్ నెంబర్ కు 9121102266 సమాచారమివ్వాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి కూడా స్వయంగా తెలియచేయవచ్చు. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
#IPLCricketBetting #online #illegalactivities #Crimealert #ModernPolicing #Damodhar #IPS #PrakasamPolice #AndhraPradeshPolice.