రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ‘ప్రపంచ చరిత్ర’

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Peoples Motivation

ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ‘ప్రపంచ చరిత్ర’

నా తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మా కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి

ప్రపంచం పోకడలపై అధ్యయనం చేసి ఇటువంటి పుస్తకం తెలుగులో రాయడం అద్భుతం

సమాజానికి మంచి పుస్తకాన్ని అందించినందుకు అభినందనలు

వెంకయ్యనాయుడులో పవర్, పంచ్‌లు తగ్గలేదు...అప్పుడూ, ఇప్పుడూ అలాగే ఉన్నారు

ప్రజలు మెచ్చుకునే ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ విధానాలు

నిర్మలా సీతారామన్ ప్రయాణం స్ఫూర్తి దాయకం...భారత్‌ను బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఆమె కృషి ప్రశంసనీయం

తెలుగుజాతి అగ్రభాగాన ఉండాలన్నదే నా ఆశయం..భారీ లక్ష్యాలను సాధించి రాష్ట్ర భవిష్యత్‌ను మార్చాలన్నది నా కల

--ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

విశాఖపట్నంలో మాజీమంత్రి దగ్గబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణకు హాజరైన సీఎం

CM Nara Chandrababu Naidu released prapancha charitra book

విశాఖపట్నం, మార్చి 6 (పీపుల్స్ మోటివేషన్):- కొన్నివేల సంవత్సరాల మానవ పరిణామ క్రమాన్ని, ప్రపంచ చరిత్రను పుస్తక రూపంలో తెలుగులో రచించడం అద్భుత ప్రయత్నం. చరిత్రను ప్రతి ఒక్కరూ చదవాలి. దగ్గుబాటి వెంకటేశ్వరావు పుస్తకం రాస్తారని నేను అనుకోలేదు. స్వతహాగా రచయిత కానటువంటి రచయిత దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఎవరూ రాయని విధంగా పుస్తకాన్ని రాశారు. ప్రతి ఇల్లు, ప్రతి లైబ్రరీలో ప్రపంచ చరిత్ర పుస్తకం ఉండాలి. సమయం దొరికినప్పుడు నేను కూడా ఈ పుస్తకం పూర్తిగా చదువుతాను. నాటి ఆచారాలు, ఆహారపు అలవాట్లు, వ్యవసాయం వంటి అంశాలను పుస్తకంలో పొందుపరిచారు. లోతుకు వెళ్లి, సాధించాలనే తపన ఉంటేనే పుస్తకం రాయడం సాధ్యం అవుతుంది. యుద్ధాలు, సామ్రాజ్యాల ఆవిర్భావం, మత పెద్దల పెత్తనాలు, ఖండాల విభజన, బానిస వ్యవస్థ, అభివృద్ది.. ఇలా ఏ విషయాన్ని వదిలిపెట్టకుండా ఈ పుస్తకంలో వెంకటేశ్వరావు ప్రస్తావించారు. భాష కళలు, వాస్తు, శిల్పం, భూ సంస్కరణలు, సామాజిక న్యాయం, భూస్వామ్య వ్యవస్థ, రాజులతో పాటు ఏపీలో ప్రజాపాలన గురించి కూడా వివరించారు. అచ్చుయంత్రం, సాంకేతిక విప్లవం, భవిష్యత్తులో ఏం జరుగుతోందో కూడా ముందుగానే ఊహించి తెలిపారు. ఇలాంటి మంచి పుస్తకం రాసిన వెంకటేశ్వరావును అభినందిస్తున్నాను. పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆత్మీయ సమ్మేళనంగా ఉంది. మా కుటుంబం నుంచి మంచి రచయిత అధ్యయనం చేసి పుస్తకాన్ని సమాజానికి అందించారు’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాజీమంత్రి, ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  

నా తోడళ్లుడు వెంకటేశ్వరరావు మా కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి

దగ్గుబాటి వెంకటేశ్వరరావు నాకు తోడల్లుడు. మా కుటుంబంలో ఒక విశిష్టమైన వ్యక్తి. ప్రతి అంశాన్ని లోతుగా ఆలోచిస్తారు. మేమిద్దరం ఒక స్ఫూర్తినిచ్చే ఎన్టీఆర్ దగ్గర ఓనమాలు నేర్చుకున్నాం. ఎన్టీఆర్ మాకు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించేవారం. వెంకటేశ్వరరావు డాక్టరు... డాక్టరు చేశాక ప్రాక్టీస్ చేయాలి. కానీ మంత్రిగా ఉండి(నవ్వుతూ) డాక్టర్‌గా ప్రాక్టీస్ చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా పనిచేశారు. అందరం ఏదో ఒకచోట తిరగాలని అనుకుంటాం గానీ పుస్తకం రాయాలని అనుకోం. మా కుటుంబంలో వెంకటేశ్వరరావు రిలాక్స్‌గా, జోవియల్‌గా ఉంటారు. ఇటీవల నన్ను కలిసినప్పుడు ఆయన్ను చూసి కొన్ని అనుమానాలను గురించి ప్రస్తావించాను. ఏ విధంగా సమయం గడిపి సంతోషంగా ఉంటున్నారని ప్రశ్నించాను. దానికి వెంకటేశ్వరరావు సమధానం చెప్తూ....ఉదయం బ్యాడ్మింటన్ ఆడుతాను, పిల్లలతో కాసేపు ఆడుకోవడం, స్నేహితులతో మాట్లాడటం, సాయంత్రం ఇంట్లో పిల్లలకు కథలు చెప్పి నిద్రపోతానని చెప్పారు. పేకాట కూడా ఆడతానని(నవ్వులు చిందిస్తూ) చెప్పారు. ఇప్పటికి వెంకటేశ్వరావు 5 పుస్తకాలు రాశారు. మొదటి పుస్తకం ఒక చరిత్రలో కొన్ని నిజాలు అని రాశారు. తర్వాత తెలుగువారి చరిత్ర-వేర్పాటువాదం, ప్రపంచతత్వం-నాయకత్వం, ప్రపంచ దేశాలు-పాలనా వ్యవస్థల అనే పుస్తకాలు రచించారు. ఇప్పుడు ప్రపంచ చరిత్ర పుస్తకం రాశారు. అగ్రదేశాలన్నీ యువరక్తం లేక బాధపడుతున్నాయి. టెక్నాలజీ ఉంది.. కానీ ఆపరేట్ చేసే మనుషులు లేని పరిస్థితి తలెత్తింది. కానీ భారతదేశం అదృష్టదేశం. మన దేశానికి కావాల్సినంత యువశక్తి ఉంది. చరిత్రను సృష్టించే అదృష్టం భారతదేశానికి వచ్చింది.’ అని సీఎం చంద్రబాబు అన్నారు.    

వెంకయ్యనాయుడులో పవర్, పంచ్‌లు తగ్గలేదు

‘1978లో నేను, వెంకయ్య నాయుడు ఎమ్మెల్యేలుగా మొదటిసారి గెలిచాం. అప్పటికీ ఇప్పటికీ ఆయన పవర్ తగ్గలేదు... పంచులు పెరుగుతున్నాయి. ఎప్పుడూ అచ్చతెలుగులో మాట్లాడుతుంటారు. చిన్నకుంటుంబలో పుట్టి అంచలంచలుగా ఎదిగి ఉపరాష్ట్రపతి అయ్యారు. గీతం యూనివర్సిటీని గతంలో కూల్చాలని చూశారు. ఎంవీవీస్ మూర్తి ఒక చరిత్ర సృష్టించారు. గీతం యూనివర్సిటీని ఎందుకు నెలకొల్పాల్సి వచ్చిందని ఒకసారి అడిగాను. మా రెండో అబ్బాయికి కాలేజీలో సీటు ఇవ్వలేదు... అందుకే మంచి వ్యవస్థను పెడతాను అని ఛాలెంచ్ చేసి గీతం యూనివర్సిటీని పెట్టానని ఆయన నాకు చెప్పారు.’ అని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 

ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను

ఆర్థిక సంస్కరణలు 1991లో వచ్చాయి. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. గతంలో అమెరికా బెస్ట్ అనేవారు... ఇప్పుడు ఇండియన్స్ బెస్ట్ అంటున్నారు. అందులో తెలుగువారు అగ్రభాగాన ఉన్నారు. అశ్రద్ధ లేకుండా కష్టపడితే వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర విజన్ సాకారమవుతుంది. నాలోని ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను. నాలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందని వెంకయ్యనాయుడు అన్నారు... ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రమే కాదు... బలమైన నమ్మకం ఉంది. దేశాన్ని మోదీ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలనుకున్నప్పుడు నా తెలుగుజాతి అగ్రభాగాన ఉండాలన్నది నా ఆశయం.’ అని సీఎం ఉద్ఘాటించారు.  

ఇంకొంత ట్రీట్మెంట్ అవసరం

మగవారికంటే మహిళలు బాగా పని చేస్తారు. నిర్మలా సీతారామన్ ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. బీజేపీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగారు. 2014లో మొదటిసారి రాజ్యసభకు ఎంపీగా ఏపీ నుంచి ఎంపికై కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నరేంద్రమోదీ ఆశయాల కోసం నిరంతరం పని చేస్తున్నారు. ప్రజలు మెచ్చుకునే ఆర్థిక మంత్రిగా కార్యక్రమాలు చేపట్టారు. వరుసగా 8వసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2014 నాటికి 10వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తీసుకొచ్చారు. భవిష్యత్తులో 3వ స్థానానికి వస్తుంది... దీనికి మనమంతా అభినందించుకోవాల్సి ఉంది. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన మందులతో వెంటిలేటర్‌పై నుంచి బయటపడగలిగాం. పూర్తిగా కోలుకోవాలంటే ఇంకా కొంత చికిత్స అవసరం. రాష్ట్రాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకరిస్తున్నారు.’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

Comments

-Advertisement-