రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మత ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగం ఉల్లంఘనే

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

మత ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగం ఉల్లంఘనే

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets

బెంగళూరు: ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలన్న కర్నాటక ప్రభుత్వం నిర్ణయంపై చర్చ సాగుతున్న నేపథ్యంలో మతం ఆధారిత కోటాను రాజ్యాంగం అనుమతించదని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హునబలె ఆదివారం స్పష్టం చేశారు. అటువంటి రిజర్వేషన్లు మన రాజ్యాంగం రూపశిల్పి బిఆర్ అంబేద్కర్కు వ్యతిరేకమైనవేనని కూడా ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ అత్యున్నత విధాన నిర్ణాయక విభాగం అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎబిపిఎస్) సదస్సు ముగింపు రోజు విలేకరులతో హెునబలె మాట్లాడుతూ, 'మతం ఆధారిత రిజర్వేషన్ను బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఆమోదించడం లేదు. ఆ పని చేస్తున్నవారు ఎవరైనా మన రాజ్యాంగం రూపశిల్పికి వ్యతిరేకంగా వెళుతున్నట్లే అని వ్యాఖ్యానించారు. ముస్లింల కోసం మతం ఆధారిత రిజర్వేషన్లను ప్రవేశపెట్టేందుకు గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర చేసిన యత్నాలను హైకోర్టులు, సుప్రీం కోర్టు తోసిపుచ్చాయని కూడా ఆయన వెల్లడించారు. అటువంటి కోటా కోసం నిబంధనలను కోర్టులు తిరస్కరించాయని హెుసబలె స్పష్టం చేశారు. మహారాష్ట్రలో 17వ శతాబ్దపు మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిపై వివాదం గురించిన ప్రశ్నకు హనబలె సమాధానం ఇస్తూ, బెరంగజేబును ఒక ఐకన ను చేశారని, సామాజిక సామరస్యంలో విశ్వాసం ఉన్న అతని సోదరుడు వాడా షికోహ్ను అలా చేయలేదని చెప్పారు. భారత విలువలకు వ్యతిరేకంగా సాగిన వారిని ఐకన్లను చేశారని ఆయన ఆరోపించారు. బ్రిటిష్ వారిని ప్రతిఘటించినవారిని కాకుండా వారిపై పోరాడినవారిని స్వాతంత్య్ర యోధులుగా పేర్కొన్నారని కూడా ఆయన అన్నారు. మొగల్ చక్రవర్తి అక్బర్పై పోరాడినందుకు రాజపుత్రుల రాజు మహారాణా ప్రతాన్ వంటి ప్రముఖులను హెుసబలె కొనియాడారు. 'ఆక్రమణ మనస్తత్వం'తో ఉన్నవారు భారత్కు ముప్పు కలిగిస్తున్నారని ఆర్ఎస్ఎస్ నేత అన్నారు. 'భారతీయ విలువలను మన్నించేవారికి మనం దన్నుగా ఉండాలి' అనిహునబలె సూచించారు.

Comments

-Advertisement-