రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రాష్ట్రవ్యాప్తంగా ఫామ్ పాండ్స్ నిర్మాణానికి శ్రీకారం

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

రాష్ట్రవ్యాప్తంగా ఫామ్ పాండ్స్ నిర్మాణానికి శ్రీకారం 

నేరుగా నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల సేద్యపు నీటి కుంటల నిర్మాణం

కర్నూలు జిల్లా, పూడిచర్లలో శంకుస్థాపన

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Pawan Kalyan deputy CM

Pawan Kalyan deputy CM

Pawan Kalyan deputy CM

Pawan Kalyan deputy CM

Pawan Kalyan deputy CM

పీపుల్స్ మోటివేషన్:-

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండలం, పూడిచర్లలో రాష్ట్రవ్యాప్తంగా రైతుల పొలాల్లో సేద్యపు నీటి కుంటల(ఫామ్ పాండ్స్) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.930 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 1.55 లక్షల ఫామ్ పాండ్స్ కు శంకుస్థాపన చేశారు. పూడిచర్లలో రైతు సూర రాజన్నకు చెందిన 1.30 ఎకరాల వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేయనున్న సేద్యపు కుంటకు భూమి పూజ చేశారు. ఉపాధి కూలీలతో కలసి స్వయంగా గడ్డపార పట్టి గుంత తవ్వి సేద్యపు గుంత పనులు ప్రారంభించారు. 

ఫారం పాండ్ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామం రైతు సూర రాజన్న కు చెందిన పొలంలో ఏర్పాటు చేయనున్న ఫారం పాండ్ పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం తలకు పాగా చుట్టి, గునపం తో మట్టిని త్రవ్వి, పారతో మట్టిని తీసి ఫారం పాండ్ పనులకు శ్రీకారం చుట్టారు..

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1.55 లక్షల ఫార్మ్ పాండ్స్ లను నిర్మిస్తున్న సందర్భంగా కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో 8500 ఫార్మ్ పాండ్స్ నిర్మించడం జరుగుతోంది..అక్కడే ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ద్వారా ఫారం పాండ్ నిర్మాణ వివరాలను అధికారులు ఉప ముఖ్యమంత్రి కి వివరించారు. అనంతరం ఇందుకు సంబంధించిన పైలాన్ ను ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ.. 

 ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష 55 వేల ఫారం పాండ్ ల నిర్మాణం చేసే పనులకు డిప్యూటీ సిఎం కర్నూలు జిల్లాలో శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని తెలిపారు.. భూగర్భ జలాలు పెంపుకు ఫారం పాండ్ లు ఉపయోగపడుతాయనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రైతుల పొలాల్లో ఫారం పాండ్ లను ఏర్పాటు చేస్తోందన్నారు.. జిల్లాలో ఎన్ఆర్ఈజిఎస్ కింద దాదాపుగా రూ.160 కోట్లతో పనులు చేపట్టామని, అందులో ఇప్పటికే 97 శాతం పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు... ఇప్పటివరకు వేతనాల కింద రూ.370 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు... జిల్లాలో 97 శాతం వరకు సీసీ రోడ్ల నిర్మాణాలను పూర్తి చేశామని, సిసి రోడ్ల నిర్మాణాల్లో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు... మిగిలిన అన్ని అభివృధింపనులను కూడా 10 రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు..మెటీరియల్ కాంపొనెంట్ కింద కూడా 100 శాతం నిధులను వినియోగించుకోగలిగామన్నారు.. జిల్లాలో కనీస వేతనం రూ. 285 రూపాయలను అందిస్తున్నామన్నారు.

పాణ్యం ఎంఎల్ఏ గౌరు చరిత మాట్లాడుతూ..

 రాష్ట్రం బాగుండాలి అని రాష్ర్ట భవిష్యత్ కోసం డిప్యూటీ సీఎం జత కట్టడం వల్ల గతంలో ఎన్నడు లేని విధంగా 164 సీట్లు కైవసం చేసుకొని కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు...రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు..2014 సంవత్సరంలో జరిగిన రాష్ట్ర విభజన కంటే గత ప్రభుత్వ పాలనలో మరింతగా నష్టపోవడం జరిగిందన్నారు.. మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చే దిశగా, సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉందన్నారు... గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు..మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13 వేల 326 గ్రామపంచాయతీలో గ్రామసభలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.. దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఒకే రోజు ఇన్ని గ్రామ సభలు జరిపిన దాఖలా లేదని, ఇదొక రికార్డు అని ఆమె తెలిపారు.. గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను చేసేందుకు గ్రామసభలో తీర్మానాలు చేసుకోవడం జరిగిందన్నారు..

గత ప్రభుత్వ హయాం లో స్థానిక సంస్థలు నిర్వీర్యం అయ్యాయని, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.1452 కోట్లు విడుదల చేసి గ్రామాల్లో తాగునీరు, స్ట్రీట్ లైటింగ్, శానిటేషన్ కోసం నిధులను కేటాయించడం జరిగిందన్నారు.. 

అదే విధంగా పల్లె పండుగ కార్యక్రమం ద్వారా 4 వేల 500 కోట్ల రూపాయలతో ఎన్ఆర్ఈజిఎస్ కింద కేంద్ర ప్రభుత్వ నిధుల సహకారంతో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు.. సీసీ రోడ్ల నిర్మాణాలకు పాణ్యం నియోజకవర్గంలో 4 మండలాల్లో రూ.16 కోట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు.. అంతేకాకుండా ఈ సీసి రోడ్ల నిర్మాణంలో రాష్ట్రంలో కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో ఉంటే పాణ్యం నియోజకవర్గo కర్నూలు జిల్లాలో ప్రథమ స్థానంలో ఉందని చెప్పడానికి సంతోషంగా ఉందన్నారు..

2014- 19లో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే జలజీవన్ కార్యక్రమాన్ని అమలు చేసిందని, గత ప్రభుత్వం లో కనీసం ఒక్క ఇంటికి నీళ్లు కూడా ఇవ్వలేకపోయిందన్నారు. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కేంద్రంతో మాట్లాడి 3 ఏళ్లు ఈ పథకాన్ని ఎక్సటెన్షన్ చేయించి రూ. 85 వేల కోట్లతో ప్రతిపాదనలు కూడా పంపించారన్నారు.. రానున్న మూడు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఇచ్చి త్రాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పిస్తామన్నారు.. 

గోకులం షెడ్లు అవసరం ఎక్కువగా ఉన్నందున పాణ్యం నియోజకవర్గంలో మరిన్ని మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రిని కోరారు.. ఓర్వకల్లు మండలాన్ని ముఖ్యమంత్రి ఇండస్ట్రియల్ హబ్ గా చేశారని, ఎన్నో పరిశ్రమలు తీసుకొని వచ్చారని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్లోనే ఓర్వకల్లు మండలానికి 2 వేల 800 కోట్లు మంజూరు చేసిందన్నారు.. దీనివల్ల అన్ని పరిశ్రమల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు, అన్ని అవసరాలు తీర్చడానికి అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఇక్కడికి ఎన్నో పరిశ్రమలు వస్తాయని, వాటి ద్వారా ఇక్కడ చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నందుకు తాము చాలా సంతోషిస్తున్నామన్నారు..

ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రైతులు పొలాలకు వెళ్ళే రహదారులు కావాలని కోరుతున్నారని, వాటిని ఎన్ఆర్ఈజీఎస్ లో చేర్చాల్సిందిగా కోరారు... అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో కాంపౌండ్ వాల్స్ లేక చాలా ఇబ్బందికి గురవుతున్నారని, ఎన్ఆర్ఈజీఎస్ లో ఈ పనులను కూడా చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు..గ్రామాల్లో స్మశాన వాటికల నిర్మాణాలు కూడా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు..

 పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి ఓర్వకల్లు నుండి గుట్టపాడు కొంతలపాడు మీదుగా ఉప్పలపాడు రోడ్డు మంజూరు చేయాల్సిందిగా కోరారు.. ఎన్ హెచ్ 44 నుండి లక్ష్మీపురం నుండి పెద్దపాడు వరకు ఒక రహదారిని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ఎన్ హెచ్ 44 నుండి రసూల్ పేట మీదుగా వడ్లుగండ్ల వరకు ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.. ఉపాధి కూలీల వేతనాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని, వేతనాలు త్వరితగతిన చెల్లించవలసిందిగా ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యురాలు భైరెడ్డి శబరి, పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు శాసన సభ్యులు గిత్తా జయసూర్య, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ శ్రీ కృష్ణ తేజ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-