DSC: త్వరలో ఉచిత ఆన్ లైన్ డీఎస్సీ కోచింగ్..10 నుంచి దరఖాస్తుల స్వీకరణ
AP MG DSC FREE COACHING
https://mdfc.apcfss.in
Free DSC coaching online
Ap govt free DSC coaching
Ap Mega DSC notification
Free coaching online apply
By
Peoples Motivation
DSC: త్వరలో ఉచిత ఆన్ లైన్ డీఎస్సీ కోచింగ్..10 నుంచి దరఖాస్తుల స్వీకరణ
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
10 నుంచి దరఖాస్తుల స్వీకరణ
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):- మెగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో త్వరలో ఉచిత ఆన్ లైన్ డీఎస్సీ కోచింగ్ ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ నెల 10 తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే 26 జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ప్రారంభించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు ఆన్ లైన్ ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇంటి వద్ద నుంచే ఆన్ లైన్ ద్వారా డీఎస్సీ కోచింగ్ పొందవొచ్చునన్నారు. బీసీ, ఈబ్ల్యూఎస్ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులన్నారు. అభ్యర్థులు టెట్ లో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఎంతమందికైనా ఆన్ లైన్ ద్వారా ఉచిత శిక్షణివ్వడానికి తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ జిల్లాలకు చెందిన జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారులను సంప్రదించాలని ఆ ప్రకటనలో మంత్రి సవిత తెలిపారు.
Comments