IPL: క్రికెట్ బెట్టింగ్ జోలికెళితే కఠిన చర్యలు తప్పవు....
IPL: క్రికెట్ బెట్టింగ్ జోలికెళితే కఠిన చర్యలు తప్పవు....
క్రికెట్ మ్యాచ్ లను వినోదం కోసం మాత్రమే చూడాలే తప్పా... కుటుంబాలలో విషాదం నింపేలా ఉండకూడదు.... .
IPL క్రికెట్ 2025 జరుగుచున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా...
అమాయక ప్రజలను, యువకులను లక్ష్యంగా చేసుకొని, ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చని ఆశలు రేకెత్తించేలా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ అమాయకులను మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా హెచ్చరించారు.
IPL క్రికెట్ 2025 జరుగుచున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ నిఘా పెంచడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. అమాయకుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఎవరైనా డబ్బు ఆశ చూపించి క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఉపేక్షించబోమన్నారు. AP జూద చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు.
తల్లి దండ్రులు తమ పిల్లలను గమనిస్తూ ఉండాలన్నారు. బెట్టింగులకు పాల్పడుతుంట్లయితే వారికి నచ్చచెప్పి ఆ ఊబిలో నుండి బయటకు తీసుకురావాలన్నారు. గతంలో బెట్టింగ్ లకు పాలపడిన వారిపై, అనుమానితుల పై నిఘా ఉంచామన్నారు.ఆన్ లైన్/ ఆఫ్లైను ద్వారా బెట్టింగ్ కు పాల్పడిన, గుంపులు గుంపులుగా కూర్చుని సెల్ చూస్తూ బెట్టింగ్స్ వేస్తున్న అలాంటి వారి పై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నంద్యాల జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే సదరు సమాచారాన్ని డయల్ 100/112 కు సమాచారమివ్వాలని జిల్లా ఎస్.పి విజ్ఞప్తి చేశారు. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. శ్రమించకుండా వచ్చే నగదు వెనుక అనేక నష్టాలు దాగి ఉంటాయని యువత గుర్తెరగాలని, కేసుల్లో నిందితులుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని, తమ తల్లిదండ్రుల కోసం ఉన్నతంగా బ్రతకాలని, బెట్టింగ్ రాయుళ్ళ వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా హెచ్చరించారు.