బాణసంచా ప్రమాదంలో ఎనిమిదికి పెరిగిన మృతుల సంఖ్య... రూ.15 లక్షల చొప్పున పరిహారం
బాణసంచా ప్రమాదంలో ఎనిమిదికి పెరిగిన మృతుల సంఖ్య... రూ.15 లక్షల చొప్పున పరిహారం
• అనకాపల్లి జిల్లాలో విషాదం
• కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు
• ఘటన స్థలాన్ని పరిశీలించిన హోం మంత్రి అనిత
• మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం..
• ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాం..
• 2026 వరకు బాణసంచా తయారీ కేంద్రానికి లైసెన్స్ ఉంది..
• ప్రమాదానికి కారణాలు విచారణలో తేలుస్తాం
బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు ఘటన అనకాపల్లి జిల్లాలో విషాదాన్ని నింపింది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఇవాళ ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ఈ ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలు కాగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
మృతులను... కైలాసపట్నంకు చెందిన అప్పికొండ తాతబాబు (50), సంగరాతి గోవింద్ (40), దేవర నిర్మల (38), పురం పాప (40), గుప్పిన వేణుబాబు (34)... భీమిలికి చెందిన హేమంత్ (20), రాజుపేటకు చెందిన దాడి రామలక్ష్మి (35), చౌడువాడకు చెందిన సేనాపతి బాబూరావు (55)గా గుర్తించారు. ప్రమాద సమయంలో బాణసంచా తయారీ కేంద్రంలో 15 మంది కార్మికులు ఉన్నారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ విచారణకు ఆదేశించారు.
కాగా, హోం మంత్రి అనిత కైలాసపట్నం చేరుకుని ప్రమాద స్థలిని పరిశీలించారు. ప్రమాద ఘటనపై స్థానికులు, అధికారులతో ఆమె మాట్లాడారు. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు మంత్రి అనిత రూ.15 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లా, కోటవురట్లలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఆరుగురు కార్మికులు మృతి చెందడం దిగ్భ్రాంతి కలిగించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారం ఆందోళన కలిగించింది. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి అనితతో ఫోన్లో మాట్లాడాను. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అగ్నిప్రమాద సమయంలో కర్మాగారంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందని ఆరా తీశాను. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ధైర్యంగా ఉండాలని కోరారు.ఈ ఘటనపై విచారణ చేసి నివేదించాలని ఆదేశించారు.