రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల సూర్యఘర్ కనెక్షన్లు

Andhra Pradesh news Ap news General News Intresting news Fact news Daily news News updates Latest news Important news Latest Short news Latest updates
Mounikadesk

రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల సూర్యఘర్ కనెక్షన్లు

డైనమిక్ సీఎం చంద్రబాబు పాలనా స్ఫూర్తితో సత్యసాయి జిల్లాలోనూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాము 

జిడిపిలో కోనసీమ జిల్లాను దాటి సత్య సాయి జిల్లా ముందుండటం కూటమి ప్రభుత్వ కృషికి నిదర్శనం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ 

రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల సూర్యఘర్ కనెక్షన్లు -రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

కూటమి ప్రభుత్వ హయాంలో మడకశిర నందు అతిపెద్ద సోలార్ పార్క్, డిఫెన్స్ పరిశ్రమ రాబోతున్నాయి -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్

మడకశిర అభివృద్ధికి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు విశేషంగా కృషి చేస్తున్నారన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

Andhra Pradesh news Ap news General News Intresting news Fact news Daily news News updates Latest news Important news Latest Short news Latest updates

మడకశిర, ఏప్రిల్ 18: ఉమ్మడి అనంతపురం జిల్లాపై సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించారని, సోలార్, ఇండస్ట్రియల్ హబ్ గా అభివృద్ధి చేయనున్నారని మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఎస్.సవిత, గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్ యాదవ్ ఓకే చేశారు. తమ అవినీతి బాగోతాలు బట్టబయలవుతున్నాయనే జగన్ డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను బయటకు తీస్తామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని మంత్రులు స్పష్టంచేశారు. మడకశిర పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామితో కలిసి మాట్లాడారు. ముందుగా జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలో పార్టీ అంతర్గత సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా ఆస్తులను ఈడీ అటాచ్ చేస్తున్న విషయం తెలుసుకుని, డైవర్షన్ రాజకీయాలకు వైసీపీ నాయకులు తెరతీశారన్నారు. వైసీపీ నాయకులకు హిందూత్వం మీద నమ్మకం లేదన్నారు. టీటీడీలో వైసీపీ నాయకులు టిక్కెట్ల విక్రయాల అక్రమాలను కూడా బయటకు తీస్తామన్నారు. ప్రతి గోవుకు జియో ట్యాగింగ్ చేశామని, గో సంరక్షణ భేషుగ్గా ఉందని అందరూ కితాబునిస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థల్లో జరిగిన అవినీతిని వెలికితీయనున్నట్లు ఇన్చార్జి మంత్రి అనగాని స్పష్టంచేశారు. 

చంద్రబాబుతోనే ఉమ్మడి
అనంతపురం అభివృద్ధి : మంత్రి సవిత

రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి సవిత తెలిపారు కర్నాటక బోర్డర్ లోఉన్న మడకశిర అభివృద్ధికి ఇటీవల సీఎ చంద్రబాబు వరాలు కురిపించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఉమ్మడి అనంతరం జిల్లా అంటే సీఎం చంద్రబాబుకు ఎంతో ఇష్టమన్నారు. ఈరోజు సాగునీరు, తాగునీరు అందుతున్నాయంటే అందుకు కారణం సీఎంచంద్రబాబునాయుడేనన్నారు. 2019-24లో గొల్లపల్లి రిజర్వాయర్ ను నిర్మించారని, కియా మోటారు పరిశ్రమను తీసుకొచ్చారని తెలిపారు. హెచ్ఎన్ఎస్ కాలువ కోసం సీఎం చంద్రబాబుతోనూ, లోకేశ్ తోనూ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, తిప్పేస్వామి తరుచూ మాట్లాడుతున్నారన్నారు. మడకశిరలోని చివరి ఎకరాకు కూడా సాగు నీరందిస్తామన్నారు. మడకశిరలో సాగవుతున్న ఒక్క పంటను దృష్టిలో పెట్టుకుని, ఒక్క ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపిన విషయాన్నిమంత్రి గుర్తుచేశారు. మరికొన్నిపరిశ్రమలు కూడా తీసుకురాబోతున్నారన్నారు. సత్యసాయి జిల్లాలో అత్యధికంగా అభివృద్ధి జరుగుతున్న నియోజక వర్గం మడకశిర అని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు .... మంత్రులు, ఎంపీలను కలిసి నిధులు ఎక్కువగా రాబట్టుకుని, నియోజకవర్గంలో అభివృద్ధికి విశేష కృషిచేస్తూ మడకశిర రూపురేఖలు మార్చుతున్నారని కొనియాడారు. సూర్య ఘర్ కింద సోలార్ నిధులు ఎక్కువగా తీసుకొస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు అని తెలిపారు. మడకశిరలోని ఎంజేపీ స్కూల్ భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఈ భవనాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల సూర్యఘర్ కనెక్షన్లు : మంత్రి గొట్టిపాటి

రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, మడకశిరలో విద్యుత్ సమస్యను దృష్టిలోపెట్టుకుని, నియోజక వర్గంలో కొత్తగా మూడు సబ్ స్టేషన్లు ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా చేస్తోందన్నారు. విద్యుత్ సమస్యలను తమ శాఖాధికారులు తక్షణమే స్పందించి, పరిష్కారానికి కృషిచేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మడకశిరలో సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. రాష్ట్రంలో సూర్యఘర్ పథకం కింద సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కనెక్షన్లు మంజూరు చేసిందన్నారు. దీనిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ సూర్యఘర్ పథకం కింద సోలార్ విద్యుత్ ఉత్పత్తికి పది వేల కనెక్షన్ మంజూరుచేశామన్నారు. లబ్ధిదారులు తమ ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు ఉదయం పూట తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ఇవ్వనున్నామన్నారు. ఇందుకోసం గ్రామాల్లోని విద్యుత్ సబ్ స్టేషన్ల పక్కన సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నామని, ఇందుకోసం టెండర్లు సైతం పిలిచామని మంత్రి తెలిపారు. గడిచిన అయిదేళ్లు సోలార్ ప్లాంట్లు పెట్టేవారిని అప్పటి ప్రభుత్వం తరమేసిందన్నారు. దీనివల్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ వెనకబడిపోయిందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు రాకతో సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టిపెట్టారన్నారు. దేశంలోనే రాయలసీమను సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తికి అనుకూల ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. మడకశిరతో పాటు సత్యసాయి జిల్లా అభివృద్ధికి తమ శాఖాపరంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు.

మడకశికరలో రూ.7 వేల కోట్లతో సోలార్ పార్క్ : మంత్రి సత్యకుమార్ యాదవ్

 రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, మడకశిర నియోజక వర్గంలో నాలుగు సబ్ స్టేషన్లు ప్రారంభించడంతో పాటు మరో మూడు సబ్ స్టేషన్ల ఏర్పాటుకు భూమి పూజ చేయడం అభినందనీయమన్నారు. చిత్తశుద్ధి కలిగిన నాయకుడు ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఎంతటి అభివృద్ధి సాధ్యమవుతుందో... ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజును చూస్తే ఇట్టే అర్థమవుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణకు ఎమ్మెస్ రాజు చేసిన పోరాటం అభినందనీయమన్నారు. మందకృష్ణ మాదిగ వలే యావత్తు మాదిగ సమాజం ఎమ్మెస్ రాజుకు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. మడకశిరలో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణంతో 24 గంటలూ సాధ్యమవుతుందన్నారు. ముఖ్యంగా కుటీర పరిశ్రమలతో ఎంతో మేలు కలుగుతుందన్నారు. సూర్యఘర్ పథకం వల్ల వినియోగదారుడిగా ఉన్న సామాన్యుడు విద్యుత్ ఉత్పత్తిదారుడిగా అవకాశం కలుగుతుందన్నారు. మిగులు విద్యుత్ ను యూనిట్ రూ.2.09 పైసలకు ప్రభుత్వానికి విక్రయించుకునే అవకాశముందన్నారు. మడకశికరలో రూ.7 వేల కోట్లతో సోలార్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పార్క్ ఏర్పాటుకు ఎక్కువ లీజుతో భూసేకరణ చేయనున్నామన్నారు. దీనివల్ల రైతుల జీవితాల్లో వెలుగురావడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాలు లభించనున్నాయన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధిపై సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు అందజేయాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారన్నారు. 

ప్రజల దృష్టిని మరల్చడానికే గోశాల అంశం

తమ అవినీతి బాగోతాలు బయటకొస్తున్నాయని గ్రహించిన ప్రజల దృష్టిని మళ్లించడానికి సున్నితమైన టీటీడీ గోశాలను వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. 2019 ఎన్నికల ముందు వివేకా హత్య కేసులో 3, 4 ఇంచుల గాయాలున్నా గుండెపోటుతో రాజకీయం చేశారన్నారు. కోడికత్తి ఘటన విషయంలోనూ ఇలాగే డ్రామాలు ఆడారన్నారు. తాజాగా వైసీపీ నాయకుల అవినీతి, మద్యం అమ్మకాల్లో మింగేసిన వేల కోట్ల రూపాయలపై సిట్ ముందుకు విచారణకు రావాల్సి వస్తోందన్నారు. అదే సమయంలో తమ ప్రభుత్వం కూడా వైసీపీ నాయకుల అవినీతి బాగోతాన్ని సిట్ ద్వారా బయటకు తీసుకొస్తున్నామన్నారు. అభివృద్ధి మీద, ప్రజా సంక్షేమం వారు మాట్లాడానికి ఏమీలేదన్నారు. అబద్ధపు, అసత్య ప్రచారాలు చేస్తూ, తమ రోత పత్రికలో రోత రాతలు రాస్తూ ప్రజల దృష్టికి మరల్చడానికి గోశాల డ్రామా అని అన్నారు. గత నాలుగు నెలలో వయస్సు మీరడం వల్ల గత నాలుగు నెలలో 44 గోవులు మరణించడడం వాస్తవమేన్నారు. ఆరు నెలలకు వైసీపీ హయాంలో 79 గోవులు మరణించాయని, ఆనాడు తమ కూటమి నాయకులు రాజకీయం చేయని విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. హిందూత్వం మీద, హైంధవ మతం మీద నమ్మకంలేని వారు, అధికారం అడ్డం పెట్టుకుని వందల కోట్లు దోచేసిన వారు, టీటీడీ అమ్మేయాలని ప్రయత్నించిన వారు ఇవాళ గోశాలపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ ఏనాడైనా సతీసమేతంగా టీటీడీ బ్రహ్మోత్సవాలకు వెళ్లారా..? అని మంత్రి సత్యకుమార్ యాదవ్ నిలదీశారు. భూమన కరుణాకరరెడ్డి తనయుడు ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయడానికి ఫ్యాక్టరీని తయారు చేశాడన్నారు. భూమన తనయుడి ఎన్నికల అక్రమాలుబయటకొస్తున్నాయని, ఈ డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు. భవిష్యత్తులో తన తనయుడు అరెస్టు చేస్తే...కూటమి ప్రభుత్వం తమపై కక్షసాధింపు చర్యలు దిగుతోందని చెప్పడానికి భూమన కరుణాకరరెడ్డి కిందా మీద పడుతున్నారన్నారు. ఆవుల మృతిపై ఆయన చిత్తశుద్ధి ఉంటే గోశాల సందర్శనకు ఎందుకు వెళ్లలేదని, ఇంటి దగ్గర ఉండి ఎందుకు ధర్నాలు చేశారని నిలదీశారు. ప్రజలకు సంబంధించిన విషయాలపై ఏనాడైనా పోరాడారా..? అని ప్రశ్నించారు. రక్షణ కల్పిస్తామని ఎస్పీ చెప్పినా కూడా గోశాలకుపోలేదని, ప్రజలు వాళ్ల డ్రామాలు గుర్తించారని అన్నారు. కల్తీ మద్యంలో భాగస్వామ్యులందరూ శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. 

ఈ సమావేశంలో హిందూపురం పార్లమెంట్ సభ్యుడు పార్థసారథి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పల్లె సింధూరరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, సహా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-