రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

విద్యార్థులకు శుభవార్త

TS ePass status TS ePASS scholarship How to check scholarship status TS TS scholarship amount release date TS ePass student service Scholarship bank a
Mounikadesk
విద్యార్థులకు శుభవార్త

స్కాలర్షిప్స్, ట్యూషన్ ఫీజుల దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు

TS ePass status TS ePASS scholarship How to check scholarship status TS TS scholarship amount release date TS ePass student service Scholarship bank account status

హైదరాబాద్, (పీపుల్స్ మోటివేషన్):

తెలంగాణలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. స్కాలర్షిప్స్, ట్యూషన్ ఫీజుల దరఖాస్తు గడువు మరోసారి పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ దివ్యాంగులు, ఈబీసీ విద్యార్థుల బోధన ఫీజులు, ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మే 31 వరకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎన్. శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి దరఖాస్తు ప్రక్రియ గడువు మార్చి 31తో ముగియనుంది. అయితే మరో మూడు నెలలపాటు పొడిగించింది. ఇప్పటికే డిసెంబరు 31తో ముగియాల్సిన గడువును తర్వాత జనవరి 31 వరకు, ఆ తదుపరి మార్చి 31కి వరకు  మరోసారి పొడిగించింది. తాజాగా మరోసారి అవకాశం కల్పించింది. కొన్ని ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాలు ఆలస్యం రాగా, ఆయా ప్రవేశాల సమాచారం ప్రభుత్వానికి రావడంలో ఆలస్యమైంది. దీంతో అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. కొత్తగా కోర్సుల్లో చేరిన విద్యార్థులు దాదాపు 5 లక్షల మందికి పైగా ఉంటారని అంచనా. ఇప్పటికి 10 లక్షల వరకు దరఖాస్తులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మే 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2024-25 విద్యా సంవత్సరానికి 11,88,120 మంది విద్యార్థులకు గాను 10,34,074 మంది దరఖాస్తు చేశారు. ఎంబీబీఎస్, పీజీ మెడికల్
ప్రవేశాలు ఇంకా పూర్తి కానందున విద్యార్థుల వివరాలను కాళోజీ వర్సిటీ ఎస్సీ సంక్షేమ శాఖకు ఇవ్వలేదు. వివరాలు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు దరఖాస్తు చేయడానికి వీల్లేకుండా పోయింది. దీంతో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి మే 31 వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలే కపోయినవారు ఈ-పాస్ వెబ్సైట్ ద్వారా కళాశాలల యాజమాన్యాలు మే 31 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
Comments

-Advertisement-