ముఖ్యమంత్రి పర్యటన భద్రతపై పకడ్బందీ ఏర్పాట్లు
ముఖ్యమంత్రి పర్యటన భద్రతపై పకడ్బందీ ఏర్పాట్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను పురస్కరించుకుని జిల్లా పోలీసులు భద్రతా ఏర్పాట్లపై పటిష్ట చర్యలు చేపట్టారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఈ నెల 26న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటుచేసిన హెలిప్యాడ్, సభ వేదిక, వాహనాల పార్కింగ్, లబ్ధిదారుల కలయక, కాన్వాయ్ మార్గాలు తదితర ఏర్పాట్లను శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఐపీఎస్ బుధవారం ఉదయం ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన పోలీసు అధికారులతో కలిసి పలు కీలక ప్రాంతాలను పరిశీలించి, భద్రతా సెక్టార్ల ఇన్‌ఛార్జులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి ఆటంకం లేకుండా, ప్రతి అంశం కచ్చితంగా అమలవ్వాలని ఆయన ఆదేశించారు.
ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు, పర్యటన రోజున ఏర్పడే ట్రాఫిక్ దృష్టిలో ఉంచుకుని వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయాలని సూచించారు. లబ్ధిదారుల రాకపోకలు, వేదికకు ప్రవేశ మార్గాలు, మీడియా సమీకరణ ప్రాంతాలు తదితరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
విభాగాల సమన్వయంతో భద్రతా చర్యలు :
పోలీసు, రవాణా, రెవెన్యూ తదితర శాఖల సమన్వయంతో భద్రతా చర్యలు అమలవ్వనున్నాయని ఎస్పీ తెలిపారు. అన్ని విభాగాలు సమయానికి స్పందించి, సమర్ధవంతంగా పని చేయాలని సూచించారు.
పరిశీలనలో ఎస్పీతో పాటు జిల్లా అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, బారికేడింగ్, పోలీసు బృందాల కేటాయింపు తదితర అంశాల్లో వేగంగా చర్యలు తీసుకుంటున్నారు.