భూభారతి పోర్టల్లో భూమి రికార్డ్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం..
భూభారతి పోర్టల్లో భూమి రికార్డ్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన భూభారతి పోర్టల్ ల్యాండ్ రికార్డ్స్ వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ పోర్టల్ ను సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ 14వ తేదీ శిల్పకళా వేదికలో అధికారికంగా ప్రారంభించారు.
ఫీచర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం
>> భూమి రికార్డుల డిజిటలైజేషన్ భూభారతి పోర్టల్ ద్వారా సులభతరం అవుతుంది ముఖ్యంగా భూమికి సంబంధించిన రికార్డులన్నింటినీ డిజిటల్ రూపంలో భూ యజమానుల వివరాలను సైతం తెలుసుకునే అవకాశం ఈ పోర్టల్ ద్వారా కలుగుతుంది.
>> జిపిఎస్ ఆధారిత సర్వే నిర్వహించడం ద్వారా భూముల సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించే అవకాశం కలుగుతుంది. తద్వారా భూముల వివాదాలను తగ్గించే వీలు ఉంటుంది.
>> భూధార్ నెంబర్ నెంబర్ ద్వారా భూమిలో వివరాలను సులభంగా గుర్తించే అవకాశం లభిస్తుంది
>> ఇకపై భూముల రిజిస్ట్రేషన్ లో మ్యుటేషన్లు, అప్పీల్స్, సమీక్షలు, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడము, నాలా రిజిస్ట్రేషన్ వాటి సేవలన్నింటికీ ఇది ఒకే ప్లాట్ ఫారంగా పని చేయనుంది. తద్వారా పలు రకాల భూ సంబంధిత సేవలు సులభతరం కానున్నాయి.
>> భూమి సంబంధిత వివాదాల వాటి పరిష్కారాలు న్యాయస్థానాలకు వెళ్లకుండానే రెవెన్యూ శాఖ ద్వారా పరిష్కరించేందుకు అప్పీల్స్ వ్యవస్థను కూడా ఇందులో ఏర్పాటు చేయనున్నారు. తద్వారా భూమి వివాదాలు పరిష్కారం అవుతాయి.
>> ప్రస్తుతం భూభారతి పోర్టల్ సేవలు రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు.
భూభారతి పోర్టల్ ద్వారా ల్యాండ్ రికార్డ్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం: ( Step By Step Guide మీ కోసం)
భూభారతి పోర్టల్ (Bhu Bharati Portal) ద్వారా ఇప్పుడు మీ భూమికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం అనేది చాలా సులభతరం అవుతుంది ముఖ్యంగా. భూభారతి అధికారిక పోర్టల్ ద్వారా మీరు ఈ వివరాలను మీ పట్టా పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుతం వెబ్సైట్ ఇంకా పైలట్ ప్రాజెక్టులో ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంటుంది.
స్టెప్ బై స్టెప్ గైడ్: భూభారతి పోర్టల్లో ల్యాండ్ రికార్డ్స్ చెక్ చేయడం
స్టెప్ 1: ముందుగా భూభారతి కి సంబంధించిన అధికారిక వెబ్ సైట్లోకి వెళ్ళండి.
భూభారతి పోర్టల్ అధికారిక వెబ్సైట్ ఇదే.
https://bhubharati.telangana.gov.in
స్టెప్ 2: ఇప్పుడు సైట్ ఓపెన్ అయిన అనంతరం. మీకు అందులో హోమ్పేజ్ లో Land Details ఆప్షన్ కనిపిస్తుంది. దీనిని క్లిక్ చేయాలి.
స్టెప్ 3: Land Details ఆప్షన్ క్లిక్ చేసిన అనంతరం మీ భూమి ఎక్కడ ఉందో ఆ జిల్లా, మండలం, గ్రామం ఎంచుకోవాలి. లేదంటే Pattadar Passbook Number ఎంటర్ చేయడం ద్వారా కూడా మీ లాండ్ రికార్డ్స్ వివరాలు తెలుసుకోవచ్చు.
స్టెప్ 4: ఇప్పుడు మీ పట్టా నంబర్ లేదా సర్వే నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయవచ్చు.
మీ దగ్గర ఉన్న భూమి వివరాల ప్రకారం మీకు అనుకూలమైన ఆప్షన్ ఎంచుకుని, వివరాలు నమోదు చేయండి.
స్టెప్ 5: మీరు అందజేసిన వివరాల మేరకు మీకు సమాచారం లభిస్తుంది.
భూమి వివరాల్లో - యజమాని పేరు, భూమి పరిమాణం, లొకేషన్ (Village, Mandal, District), భూధార్ నంబర్, రిజిస్ట్రేషన్ వివరాలు, మ్యూటేషన్ స్టేటస్ వివరాలు కనిపిస్తాయి. మీరు దీనిని ప్రింట్ చేసుకోవచ్చు.
గమనిక: భూభారతి ప్రస్తుతం నాలుగు మండలాల్లో మాత్రమే పైలెట్ ప్రాజెక్టుగా అమలు అవుతోంది. కనక పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చిన అనంతరం మీకు వివరాలు కనిపించే అవకాశం ఉంది.