రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ప్రభుత్వం సంచలన నిర్ణయం: అంగన్‌ వాడీ ఉద్యోగాలకు డిగ్రీ క్వాలిఫికేషన్

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

ప్రభుత్వం సంచలన నిర్ణయం: అంగన్‌ వాడీ ఉద్యోగాలకు డిగ్రీ క్వాలిఫికేషన్ 


అంగన్ వాడీ టీచర్ల ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ టెన్త్ లేదా అంతకంటే తక్కువే ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల ఆధ్వర్యంలో అంగన్ వాడీ కేంద్రాలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి.

అయితే ప్రస్తుతం దేశంలో జనాభా పెరుగుదల కనిపిస్తుంది. జనాభా కారణంగా అంగన్ వాడీ కేంద్రాలు కూడా పెంచుతోంది ప్రభుత్వం. ఈ క్రమంలో అంగన్ వాడీ టీచర్లు, వారి సహాయకుల పోస్టులు కూడా పెరుగుతున్నాయి. అయితే పిల్లలకు చిన్నవయసు నుంచే నాణ్యమైన విద్య, ఆహారం అందించే విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అయితే అంగన్ వాడీ టీచర్ల భర్తీ, అర్హతల విషయంలో ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వర్కర్ల అర్హతను డిగ్రీకు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ ఉత్తర్వులు జారీ చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలుగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన అర్హతను కలిగి ఉండాలని ఈ మేరకు నిర్ణయించారు.

అయితే ఒడిశా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త రూల్.. ప్రస్తుతం రాష్ట్రంలో పని చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు వర్తించదని కేబినెట్ స్పష్టం చేసింది. గత నిబంధనల ప్రకారం నిర్ణయించిన అర్హతల ప్రకారమే వారందరూ కొనసాగుతారని వెల్లడించింది. కొత్త నియమాకాలకు డిగ్రీ క్వాలిఫికేషన్ తప్పనిసరి చేసినట్లు తెలిపింది.

ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ ప్రోగ్రామ్ ద్వారా ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ఆరోగ్యం, పోషకాహారం, విద్య సేవలను అందించే బాధ్యతలను అంగన్‌వాడీ కార్యకర్తలు నిర్వర్తిస్తారు.

Comments

-Advertisement-