జనసేన పార్టీ తరఫున అనుబంధ విభాగం ఏర్పాటు చేయండి
జనసేన పార్టీ తరఫున అనుబంధ విభాగం ఏర్పాటు చేయండి
శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ ని కలిసిన ఉపాధ్యాయులు
ఉపాధ్యాయులంతా ఏకమై జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆయన రాజకీయ ప్రయాణంలో తమవంతు పాత్ర పోషిస్తామని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ గారిని కోరారు. మంగళవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో హరిప్రసాద్ కలిసి వినతిపత్రం సమర్పించారు. జనసేన పార్టీకి అనుబంధంగా ఉపాధ్యాయ విభాగం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు. 26 జిల్లాల్లో ఎంతో మంది ఉపాధ్యాయులు జనసేన విధానాలకు ఆకర్షితులు అయ్యారని, ఈ క్రమంలో అనుబంధ విభాగంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.పవన్ కళ్యాణ్ విధానాలకు అనుగుణంగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ విషయం పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని హరిప్రసాద్ హామీ ఇచ్చారు.