పిల్లల పెంపకంలో జాగ్రత్తలు పాటించండి
పిల్లల పెంపకంలో జాగ్రత్తలు పాటించండి
అనంతపురం
వేసవి సెలవుల్లో పిల్లల పెంపకంలో తలిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఐసీపీఎస్ సోషల్ వర్కర్ వెంకట్ కుమార్ తెలిపారు.
అనంతపురం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వేసవి సెలవుల్లో పిల్లల విషయంలో తల్లీదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాప్తాడు వెలుగు కార్యాలయంలో బుధవారం అవగాహన కల్పించారు.
వేసవి సెలవుల కారణంగా చిన్నపిల్లలు బావులు, కుంటలు, చెరువులు వద్ద ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చాలామంది పిల్లల చనిపోయిన నేపథ్యంలో బాలాజీ గ్రామ సంఘం సభ్యులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఏప్రిల్ 30వ తేదీ అక్షయ తృతీయ రోజున జిల్లాలో బాల్య వివాహాలు జరిగే ఆస్కారం ఉందని, అందుకోసం బాల్య వివాహా ల గురించి, వాటి అనర్థాలు, చట్టం గురించి తెలిపారు. అమ్మాయిల వయసు 18 సంవత్సరాలు, అబ్బాయిల వయసు 21 సంవత్సరాలు ఉండాలని అంత కన్నతక్కువ వయసు కలిగిన వారు బాల్య వివాహం చేసుకుంటే వారికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష రూ.లక్ష జరిమానా విధిస్తారన్నారు.
వివాహం చేసుకోవడానికి ఆధార్ ప్రామాణికం కాదని, బర్త్ సర్టిఫికేట్ లో వయస్సు ను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. బాల్య వివాహల నిరోధనికి అన్ని శాఖలు కలిసి పనిచేయాలని తెలిపారు. రాప్తాడు మండల సీసీ ఉమాదేవి, వీఓఏ సుధామణి, వీఓ ఎల్ షహనాజ్ , గ్రామ సంఘం సభ్యులు పాల్గొన్నారు.