రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పహల్గాం ఉగ్రదాడి బాధితులకు నష్ట పరిహారం..

Kashmir Valley Protests Terrorist Attack in Pahalgam Kashmir Tourism Omar Abdullah Mallikarjun Kharge Jammu and Kashmir Anti-Terrorism Protest Pahalga
Mounikadesk

పహల్గాం ఉగ్రదాడి బాధితులకు నష్ట పరిహారం.. ప్రకటించిన జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం.. పూర్తి వివరాలు ఇవే

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలో మంగళవారం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఈఉగ్రదాడిలో మొత్తం 26 మంది పర్యాటకులు మరణించారు. మరణించిన వారిలో ఇద్దరు విదేశీయులు సైతం ఉన్నారు. 

పాకిస్తాన్‌కు చెందిన నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ షాడో గ్రూప్ 'రెసిస్టెన్స్ ఫ్రంట్'తామే ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. ఇకపోతే మృతుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఉగ్రదాడిలో మృతిచెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయాలైన వారికి రూ.లక్ష ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రదాడి అనంతర కేంద్రహోంశాఖ మంత్రి శ్రీనగర్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. 

ఇకపోతే ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి ఉగ్రదాడికి సంబంధించి పలు కీలక విషయాలను అడిగి తెలుసుకున్నారు.

పహల్గాంలో ఉగ్రవాదుల ఘాతుకం

కశ్మీర్ అనంతనాగ్‌ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మంగళవారం ఉగ్రవాదుల దాడిలో 26 మంది మృతి చెందారు. టూరిస్టులే లక్ష్యంగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఉగ్రమూకలు కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఉగ్రదాడిలో కోఠిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ)లో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న హైదరాబాద్ వాసి మనీశ్ రంజన్ మృతిచెందారు. 

వీరితపాటు విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి సైతం మరణించారు. కుటుంబ సభ్యుల ఎదురుగానే వీరిని ముష్కరులు కాల్చి చంపారు. ఇకపోతే ఈ ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు మృతుల వివరాలను సైతం ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనను భారత ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోపాటు పలువురు సెలబ్రిటీలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

చంద్రమౌళిని వెంటాడి చంపిన ఉగ్రవాదులు

ఇకపోతే ఉగ్రదాడిలొ విశాఖ వాసి చంద్రమౌళి (రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి)ని వెంటాడి మరీ కాల్చి చంపారు. ఉగ్రవాదులను చూసి పారిపోతున్న చంద్రమౌళిని ఉగ్రవాదులు వెంటాడి మరీ కాల్చిచంపారు. తనను చంపొద్దని వేడుకున్నా ఉగ్రవాదులు ఏమాత్రం కనికరించలేదు. విశాఖ నుంచి ఈ నెల 18న జమ్ము కాశ్మీర్‌కు ఆరుగురు వెళ్లారు. చంద్రమౌళి ఆయన సతీమణి నాగమణితో పాటు మరో ఇద్దరు దంపతులు వెళ్లారు. ఇకపోతే చంద్రమౌళి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. చంద్రమౌళి మృతదేహాన్ని ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా విశాఖకు తరలించారు.

ఐడీ కార్డు చూసి మరీ కాల్పులు

మరోవైపు కోఠిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ)లో సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్న మనీశ్ రంజన్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. కుటుంబ సభ్యులతో కలిసి పహల్గాం పర్యటనకు వెళ్లగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. భార్య, పిల్లల ఎదురుగానే ఆయనను కాల్చి చంపారు. మనీశ్ ఐడీ కార్డు చూసి మరీ కాల్పులు జరిపారని తెలుస్తోంది. బీహార్‌కు చెందిన మనీశ్‌ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో జీవిస్తున్నారు.

ఉగ్రదాడిలో మృతుల వివరాలు ఇవే

1.సుశీల్ నత్యాల్-- ఇండోర్

2. సయద్ అదిల్ హుస్సేన్ షా-- అనంత్ నాగ్

3. హేమంత్ సుహాశ్ జోషి-- తమి ముంబై

4. వినయ్ నార్వాల్ -- కర్ణల్ హర్యానా

5. అతుల్ శ్రీకాంత్ మోని-- మహారాష్ట్ర

6. నీరజ్ ఉథ్వాణి-- ఉత్తరాఖండ్

7. బిటన్ అధికారి-- విష్ణుకలకతా

8. సుదీప్ న్యూపనే-- నేపాల్

9. శుభం ద్వివేది-- కాన్పూర్ సిటీ ఉత్తర ప్రదేశ్

10. ప్రశాంత కుమార్ సత్పతి-- మలశ్వర్(ఓడిశా)

11. మనీశ్ రంజన్-- బీహార్

12. ఎన్ రామచంద్ర-- కొచ్చి (కేరళ)

13. సంజయ్ లక్ష్మణ్ లాలి-- థాణే(ముంబై)

14.దినేశ్ అగర్వాల్--- చండీఘర్

15. సమీర్ గుహర్-- కోల్‌కత్తా

16 దిలీప్ దాసలి-- పన్వీల్ ముంబై

17. జే సచంద్ర మోలి-- విశాఖపట్నం

18. మధసూదన్ సోమిశెట్టి--కావలి

19. సంతోష్ జఘడా-- పుణే (మహారాష్ట్ర)

20. మంజునాథ్ రావు-- కర్ణాటక

21.కస్తుబా గాన్వోటే-- పూణే(మహారాష్ట్ర)

22.భారత్ భూషన్ -- సుందర్ నాగ బెంగళూర్

23.సుమిత్ పర్మార్-- భావనగర్(గుజరాత్)

24. యటేష్ పర్మార్-- భావనగర్(గుజరాత్)

25. తగెహల్యింగ్ -- అరుణాచల్ ప్రదేశ్

26. శైలేష్ భాయ్ హెచ్.హిమ్మత్‌భాయ్-- సూరత్ (గుజరాత్)

Comments

-Advertisement-