రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫలితాలు వచ్చేది అప్పుడే

Telangana tenth results 2025 link www bse telangana gov in 2025 telangana ssc exam time table 2025 10th class ts ssc result 2025 telangana SSC results
Peoples Motivation

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫలితాలు వచ్చేది అప్పుడే

• తెలంగాణలో నాలుగైదు రోజుల్లో విడుదల కానున్న పదో తరగతి ఫలితాలు..

• తేదీని ఖరారు చేయాలని కోరుతూ సీఎంను కోరిన అధికారులు..

Telangana tenth results 2025 link www bse telangana gov in 2025 telangana ssc exam time table 2025 10th class ts ssc result 2025 telangana SSC results

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న పదో తరగతి ఫలితాలు మరో నాలుగు లేదా ఐదు రోజుల్లో విడుదల కానున్నాయి. ఫలితాలకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయినందున విడుదల తేదీని ఖరారు చేయాలని కోరుతూ ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రభుత్వానికి దస్త్రం పంపింది. దాన్ని ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించినట్లు సమాచారం. ఈ నెల 2వ తేదీతో పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ముగియగా, 15వ తేదీతో జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయింది. పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది హాజరయ్యారు.

 తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లో మార్కుల వివరాలు తెలుసుకోవచ్చు. విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేస్తే.. ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అలాగే SMS ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీని కోసం TS10ROLL NUMBER అని టైప్ చేసి 56263కు మెసేజ్ సెండ్‌ చేస్తే చాలు.. మీ ఫలితాలు SMS ద్వారా క్షణాల్లో వస్తాయి.
Comments

-Advertisement-