రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Pahalgam Attacks Video: బొట్టు ఉందని చంపేశారు.. భర్తతో హనీమూన్‌కు వచ్చిన భార్య అరణ్య రోదన.. వీడియో వైరల్..!!

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

Pahalgam: బొట్టు ఉందని చంపేశారు.. భర్తతో హనీమూన్‌కు వచ్చిన భార్య అరణ్య రోదన.. వీడియో వైరల్..!!


Pahalgam Terrorist Attack several tourist died news: జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ముఖ్యంగా అనంత్ నాగ్ జిల్లా పహాల్గంలో హిందు టూరిస్టులే టార్గెట్ గా కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో.. దాదాపు.. 27 మంది టూరిస్టులు ఘటన స్థలంలోనే విగత జీవులుగా మారిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి సీరియస్ గా ఉంది.

ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో.. బైసరన్ ప్రాంతంలో విహరించేందుకు వచ్చిన హిందుటూరిస్టులు టార్గెట్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో ఇటీవల పెళ్లి అయి.. హనీమూన్ కు వచ్చిన జంట ఘటన పెను విషాదంగా మారింది. భార్య కళ్ల ముందే భర్తను పాయింట్ బ్లాంక్ లో కాల్చిచంపారని...మహిళ వాపోయింది. తన మతం అడిగి మరీ ఈ దాడులకు పాల్పడినట్లుకూడా ఆమె చెప్పింది. 

హిందువులు, బొట్టు ఉన్నవాళ్లను టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారని పహాల్గంలోని బాధితులు బలగాలకు వెల్లడించాయి. అడవి ప్రాంతం నుంచి ఒక్కసారిగా ఉగ్రవాదులు బైసరన్ ప్రాంతానికి వచ్చి ఇష్టమున్నట్లు కాల్పులకు తెగబడ్డారు. అప్పటి వరకు ఆనందంగా..కేరింతలతో ఉన్న ప్రదేశమంతా రక్తపాతంతో, శవాల దిబ్బగా మారింది .

ఈ ఘటనను జమ్ము సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. అదే విధంగా ప్రధాని మోదీ ఘటనపై ఆరాతీశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హుటా హుటీన శ్రీనగర్ కు బయలుదేరారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. ఈ ఘటన మరోసారి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈఘటనకు చెందిన వీడియోలు వైరల్గా మారాయి.

Comments

-Advertisement-