రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Road Accident: ఓవర్‌టేక్ కంటైనర్‌ను ఢీకొట్టి ఐదుగురు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident Tirupati District Fatal Car Accident Andhra Pradesh Accident National Highway Accident Pootapalli Accident Container Truck Accident Five
Peoples Motivation

Road Accident: ఓవర్‌టేక్ కంటైనర్‌ను ఢీకొట్టి ఐదుగురు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఘోర రోడ్డు ప్రమాదం

• తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

• ఓ కారు అదుపు తప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లి..

• ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు..

Road Accident Tirupati District Fatal Car Accident Andhra Pradesh Accident National Highway Accident Pootapalli Accident Container Truck Accident Five

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంపాకాల మండలం నేండ్రకుంట సమీపంలోని కోనప‌్ప రెడ్డి పల్లి ఓ కారు అదుపు తప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తమిళనాడుకు చెందిన ఏడుగురు భక్తులు కారులో తిరుమలకు బయలుదేరారు. అయితే పాకాల వద్ద కారు ఓవర్‌టేక్ చేయబోయి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్‌ ఢీట్టింది. ఆపై కంటైనర్ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే తమిళనాడుకు చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఓ వృద్ధుడు, చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. కారు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కారులో ఉన్నవారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కారు పూర్తిగా కంటైనర్ కిందకు వెళ్లిపోవడంతో వెంటనే దాన్ని బయటకు తీశారు. కానీ అప్పటికే కారులో ఉన్నవారు చనిపోయినట్లు ధృవీకరించారు. అలాగే పోలీసులు అక్కడకు చేరుకుని ప్రమాద స్థలిని పరిశీలిస్తున్నారు. ఇంతటి ఘోర ప్రమాదాన్ని చూసి చుట్టుపక్కల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం విచారం.. ప్రభుత్వ పరంగా సాయం అందించండి

తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పాకాల మండలం తోటపల్లి వద్ద కంటైనర్‌ను కారు ఢీ కొన్న ఘటనలో కారులోని వారు ప్రాణాలు కోల్పోయారని.. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా మరికొందరు గాయపడ్డారన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లా అధికారులను సీఎం ఆదేశించారు. క్షతగాత్రులకు రుయా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.

Comments

-Advertisement-