రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Ronin: దేశాన్ని కాపాడిన ఎలుక‌..?

Ronin rat for sale Landmine rat African giant pouched rat Bomb rat Carolina hero rat
Mounikadesk

Ronin: దేశాన్ని కాపాడిన ఎలుక..?

బాంబుల నుంచి ఓ దేశాన్నే కాపాడి గిన్నిస్ రికార్డు సృష్టించిన ఎలుక..

కంబోడియాకు చెందిన ఎలుక రోనిన్‌కు ల్యాండ్‌మైన్‌లు, బాంబులు గుర్తించడం పని..

ఈ మైన్-డిటెక్టింగ్ ఎలుక 100కి పైగా ల్యాండ్‌మైన్‌లు, 15 బాంబులను గుర్తించిన వైనం..

త‌మ‌ను పేలుడు ప‌దార్థాల నుంచి కాపాడుతున్న రోనిన్‌ను హీరోగా కీర్తిస్తున్న దేశ ప్ర‌జ‌లు..

Ronin rat for sale Landmine rat African giant pouched rat Bomb rat Carolina hero rat

బాంబుల నుంచి ఓ దేశాన్నే కాపాడి ఎలుక గిన్నిస్ రికార్డు సృష్టించింది. కంబోడియాకు చెందిన ఎలుక రోనిన్‌కు ల్యాండ్‌మైన్‌లు, బాంబులు గుర్తించడం పని. దీనితో ఈ మైన్-డిటెక్టింగ్ ఎలుక 100కి పైగా ల్యాండ్‌మైన్‌లు, 15 బాంబులను గుర్తించింది. జంతువులకు శిక్షణ ఇచ్చే లాభాపేక్షలేని సంస్థ అపోపో ప్రకారం... ఆఫ్రికన్ దిగ్గజ పౌచ్డ్ ఎలుక అయిన రోనిన్ 2021 నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఇలా భారీ మొత్తంలో మెయిన్-డిటెక్టింగ్‌తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. కంబోడియాలో ప్రజల భద్రతకు ఇది ఎంతో దోహదపడుతుందని గిన్నిస్ రికార్డ్స్ వారు రోనిన్ ను హైలైట్ చేశారు. ఇక త‌మ‌ను పేలుడు ప‌దార్థాల నుంచి కాపాడుతున్న రోనిన్‌ను ఆ దేశ ప్ర‌జ‌లు హీరోగా కీర్తిస్తున్నారు.

రోనిన్‌కు ముందు అత్యధికంగా పేలుడు పదార్థాలను గుర్తించిన రికార్డు మగవా అనే మరో ఎలుక పేరుతో ఉండేది. అది ఐదు సంవత్సరాలలో 71 ల్యాండ్‌మైన్‌లు, 38 బాంబులను గుర్తించింది. 2021లో మగవా పదవీ విరమణ చేసింది. మగవా అద్భుతమైన సేవకు PDSA జంతు స్వచ్ఛంద సంస్థ దానికి ధైర్య పతకాన్ని అందించింది. కానీ, దురదృష్టవశాత్తు 2022 జనవరిలో వృద్ధాప్యం కారణంగా మరణించింది. ఇప్పుడు రోనిన్ 100కి పైగా ల్యాండ్‌మైన్‌లను గుర్తించి మగ్‌వా రికార్డును బద్దలు కొట్టింది. అత్యధిక పేలుడు ప‌దార్థాల‌ను గుర్తించిన ఎలుక‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ద‌క్కించుకుంది.

Comments

-Advertisement-