రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

TET: మరో టెట్ నోటిఫికేషన్ విడుదల

TET NOTIFICATION TET NOTIFICATION SCHEDULE RELEASE TELANGANA TET NOTIFICATION AP TET NOTIFICATION TS TET AP MEGA DSC TS DSC TS TET SHEDULE TS TET 2025
Peoples Motivation

TET: మరో టెట్ నోటిఫికేషన్ విడుదల

• టెట్ నోటిఫికేషన్ షెడ్యూల్‌ విడుదల..

• జూన్ 15 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు నిర్వహణ..

• వెబ్‌సైట్‌లో ఈనెల 15 నుంచి నోటిఫికేషన్ పూర్తి సమాచారం లభ్యం

TET NOTIFICATION TET NOTIFICATION SCHEDULE RELEASE TELANGANA TET NOTIFICATION AP TET NOTIFICATION TS TET AP MEGA DSC TS DSC TS TET SHEDULE TS TET 2025

తెలంగాణ ప్రభుత్వం టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు టెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఈ నెల 15 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జులై 22వ తేదీన ఫలితాలు విడుదల చేయనున్నారు. ఒక పేపర్ రాసేవారికి రూ. 500, రెండు పేపర్లు రాసేవారికి రూ. 1,000గా రుసుమును నిర్ణయించారు. జూన్ 9వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఏడాదికి రెండుసార్లు..

తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు (జూన్, డిసెంబర్) టెట్ పరీక్ష నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గతేడాది జులైలో ప్రకటించింది. ఇందులో భాగంగా గతేడాది డిసెంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం.. ఈ ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించింది. జనవరిలో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 2లక్షల మందికి పైగా హాజరయ్యారు.

Comments

-Advertisement-