మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తన నిందితుడికి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష మరియు 5000 వేల రూపాయలు జరిమానా
మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తన నిందితుడికి 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష మరియు 5000 వేల రూపాయలు జరిమానా
భవానిపురం పోలీసు స్టేషన్ పరిదిలో ఫిర్యాది తన మానువరాళ్లతో కలిసి జీవిస్తున్నట్లు, ఫిర్యాది కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు ఈ క్రమంలో ది.13.06.2020 తేదీన ఫిర్యాది పెద్ద మానువరాలు అయిన బాలిక (8 సం.) ఆడుకుంటానికి బయటకు వెళ్ళి ఎంతకూ రాకపోవడంతో చుట్టుపక్కల వెతుకుతున్న సమయంలో భవానిపురం ఔట్ ఎజెన్సీ సమీపంలోని ఒక పాడుబడిన ఇంటిలో ఫిర్యాది ఇంటి సమీపంలో నివసించే మట్టి సుబ్బారావు (60సం.) అనే వ్యక్తి సదరు బాలికను సృహ తప్పెలా చేసి తన ఫ్యాంట్ తీసి బాలికతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుండగా ఫిర్యాది చూసి గట్టిగా అరిచినట్లు వెంటనే అక్కడ నుండి అతను పారిపోయినట్లు, బాలికను ఇంటికి తీసుకువెళ్లి సృహలోకి వచ్చిన తరువాత భవానిపురం పోలీసు స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయగా భవానిపురం పోలీసు వారు క్రైమ్ నెంబర్ 551/ 2020 U/s 376 AB IPC & sec 6 of POCSO act గా కేసు నమోదు చేసి ధర్యాప్తు ప్రారంభించిన్నారు.
అప్పటి పశ్చిమ ఎ.సి.పి. కె.సుధాకర్ గారు సదరు కేసును ధర్యాప్తు చేసి ది 16.06.2020 తేదీన నిందితుడైన భవానిపురం ఔట్ ఏజెన్సీ ఏరియాకు చెందిన మట్టి సుబ్బారావు (60 సం.) ను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టడం జరిగింది. అనంతరం చార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది.
విచారణ అనంతరం నిందితుడు అయిన మట్టి సుబ్బారావు (65 సం.) పై నేరం ఋజువైనందున ది.05.05.2025 వ తేదీన విజయవాడ POCSO Court, జడ్ వి.భవానీ నిందితుడుకి ఇరవై సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష మరియు 5000 వేల రూపాయలు జరిమాన విధించడం జరిగింది. బాధిత బాలికకు 5లక్షల రూపాయలు నష్టపరిహారం వచ్చేవిధంగా చూడాలని డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ సర్వీస్ అధారిటీ వారిని ఆదేశించడం జరిగింది.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరుపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి వి.కృష్ణ వేణి గారు, అప్పటి పశ్చిమ ఎ.సి.పి. కె.సుధాకర్ , సి.యమ్.ఎస్. ఇనస్పెక్టర్ జగదీశ్వరరావు , ప్రస్తుత భవానిపురం పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర రావు మరియు, సి.ఎమ్.యస్. సిబ్బంది పర్యవేక్షణలో 13 మంది సాక్షులను విచారించడం జరిగింది.