2047 నాటికి సర్క్యూలర్ ఎకానమి 2 ట్రిలియన్ల కు చేరుకుంటుంది
2047 నాటికి సర్క్యూలర్ ఎకానమి 2 ట్రిలియన్ల కు చేరుకుంటుంది
• దేశంలోనే సర్క్యూలర్ ఎకానమి ని మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలపాలి
• నేడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ మన రాష్ట్ర విధానం
• మరో ఆరు నెలల్లో సర్క్యూలర్ ఎకానమి పై రూట్ మ్యాప్ సిద్ధం
- కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఛైర్మన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్.
2047 నాటికి సర్క్యూలర్ ఎకానమి 2 ట్రిలియన్ లకు చేరుకోవడం ఖాయమని, 2030 నాటికే రూ. 4వేల కోట్లకు పైగా ఆదాయం పొందేలా ప్రణాళికలు సిద్ధం చేసి ఇప్పటికే ఆచరణలో పెట్టామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో జీరో వేస్ట్ పై సర్క్యూలర్ ఏకానమి థీమ్ తో విజయవాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో రెండు రోజుల వర్క్ షాప్ ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ దేశంలోనే సర్క్యూలర్ ఎకానమిలో మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిపటానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ స్థానంలో నేడు మన రాష్ట్రం స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానం లో దూసుకుపోతుందని అన్నారు. దేశంలోనే వేస్ట్ మేనేజ్ మెంట్ లో భాగంగా సర్క్యూలర్ ఎకానమి పై ఒక విధానం రూపొందించిన మన రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఆదర్శాంగా నిలిచిందన్నారు. రాబోయే ఆరు నెలల్లో రోడ్ మ్యాప్ సిద్ధం చేసి సర్క్యూలర్ ఎకానమి ని అందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని హామి ఇచ్చారు. రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ ఏర్పాటుతో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. అందుకనే మన ముఖ్యమంత్రి జీరో వేస్ట్ పై దృష్టి సారించి అద్భుత ఫలితాల సాధనకు కృషి చేస్తున్నారని వివరించారు. స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే చెత్త నుండి సంపద సృష్టిస్తున్నామని తెలిపారు.
ఎన్విరాన్ మెంట్, పారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. అనంత రాము మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ తో అభివృద్ధి సాధిస్తాం అని విజన్ తో గుర్తించి ఉమ్మడి ఏపీలో బీజం నాటిన విధంగానే జీరో వేస్ట్ పై సర్క్యూలర్ ఎకానమి పై ముందుగానే విజన్ తో అడుగులు వేశారని, అది ఇప్పుడు మొక్కై ఎదుగుతుందని, త్వరలోనే ఫలితాలు అందుకుంటామన్నారు. మన ప్రకృతి మనకు అందించిన ఖనిజ సంపద మనం తవ్వి వాడే కొద్ది ఒక దశ దాటిన తరువాత తరిగిపోతుందని, కాని ఆ ఖనిజ వేస్ట్ ను రీసైక్లింగ్ చేసే ఆలోచనే సర్క్యూలర్ ఎకానమి అని వివరించారు. రీసైక్లింగ్ కు సంబంధించిన నిబంధనలు గతంలోనే ఉన్నాయని, వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించామని, నేడు వాటి అమలుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ నిబంధనలు అభివృద్ధి సాధించడానికే కాని ఇబ్బందులు పెట్టడానికి కాదన్నారు. రీసైక్లింగ్ ను సక్రమంగా వినియోగిస్తే వ్యర్థాల నుండి సంపద సృష్టి జరుగుతుందన్నారు.
ఏపీపీసీబీ ఛైర్మన్ డాక్టర్ పి. కృష్ణయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో వ్యర్థాలను పునర్ వినియోగం లోనికి తీసుకవచ్చి ఆర్థికరంగాన్ని పరిపుష్టం చేసేందుకు , పర్యావరణ పరిరక్షణకు , ఉపాధి కల్పనకు రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహించి అందరి సూచనలు, సలహాలను, కార్యాచరణ రూపొందించి నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. సర్క్యులర్ ఎకనమీ ద్వారా కొత్త పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనకు ఈ జాతీయ స్థాయి వర్క్ షాప్ దోహదపడుతుందన్నరు. వర్క్ షాపుకు దేశంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన పారిశ్రామిక వేత్తలు, శాస్త్రవేత్తలు, బ్యాంకర్లు హజరవడం హర్షనీయమన్నారు. పరిశ్రమలలో వ్యర్థాలు రాకుండా చేయడం ఒక ఎత్తు అయితే ఆ వ్యర్థాలను పునర్ వినియోగం చేయడం మరొక ఎత్తు అని అన్నారు. సర్క్యూలర్ ఎకానమి పై ఏపీ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకరానుందన్నారు. ఎలక్ట్రానిక్, బ్యాటరీలు, పాత వాహనాలను రీ సైక్లింగ్ చేసే సమగ్ర ప్రణాళిక ప్రస్తుతం మన రాష్ట్రం లో అందుబాటులో లేదని, అలాగే వ్యర్థాలు ఎంత ఉత్పత్తి అవుతున్నాయి అన్న అంచనా కూడా లేదన్నారు. మన రాష్ట్రంలో వ్యవసాయ వ్యర్థాలతో కంప్రెసర్ బయోగ్యాస్ తయారు చేందుకు రూ. 500 కోట్ల రూపాయలతో రిలయన్స్ కంపెనీ ఇప్పటికే ప్లాంట్ లను ఏర్పాటు చేస్తుందన్నారు.
కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ శరవణన్, గౌతమ్ మెహ్రా, బీఎస్ఎస్ ప్రసాద్, ఏపీఈఎంసీ ఛైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, వరలక్ష్మీ, సంజయ్ మెహతా, మెటిరీయల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, స్టాక్ హోల్డర్స్, పరిశోధన సంస్థల ప్రతినిధులు, వేస్ట్ రీసైక్లర్లు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ఏపీపీసీబీ ప్రధాన కార్యాలయ అధికారులు , జోనల్ మరియు రీజనల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.