రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు.
అన్ని కూడళ్ళు, హైవే, ప్రవేశం, నిష్క్రమణ ప్రాంతాలలో విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు.
ప్రజల కోసం నంద్యాల పోలీసులు ఉన్నారనే భద్రత భావాన్ని ప్రజల్లో పెంపోదించేందుకు కృషి చెయ్యాలని, రాత్రి పూట దొంగతనాలు, అల్లర్లు, గొడవలు జరగకుండా చర్యలు తీసుకోవాలి.
గ్రామ మరియు పట్టణ శివారు ప్రాంతాలలో నేరాలు జరిగే ప్రదేశాలలో, నిర్మానుష్య ప్రాంతాలలో డ్రోన్ కెమెరాలతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై నిఘా ఉంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
రాత్రి వేళలో అనవసరంగా తిరిగే వారిపై ప్రత్యేక దృషి ఉంచి వారి వేలిముద్రలు సేకరించాలి అవసరమైతే చర్యలు తీసుకోవాలి.
ద్విచక్రవాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.
సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్ లకు దూరంగా ఉండాలన్నారు.
పరిమితికి మించి ప్రయాణీకులను ఆటోలలో తరలిస్తే చర్యలు తప్పవని సూచించారు.
రోడ్డు భద్రత నియమాల ఉల్లంఘనలపై పోలీసులు చర్యలు చేపట్టారు.
మైనర్ల వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. కావున తల్లిదండ్రులు వారిపై నిఘా ఉంచి మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు.
అతివేగం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, ఓవర్‌లోడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఆటో సైడ్ సిట్టింగ్, డెఫెక్టీవ్ నంబర్ ప్లేట్స్, అనధికార పార్కింగ్ మొదలైన ఉల్లంఘనలకు జరిమానాలు విధించాలని ఆదేశాలు.
జాతీయ రహాదారులపై రాంగ్ రూట్ లలో వెళ్ళవద్దు.
గమ్యాలకు సురక్షితంగా చేరాలని, ఇతరులకు, మీకు ప్రాణనష్టం జరగకుండా వాహనాలు నడపాలని సూచించారు.