త్వరలోనే అన్ని అంశాలతో 'ఈసీఐనెట్'
త్వరలోనే అన్ని అంశాలతో 'ఈసీఐనెట్'
కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో..
సిద్ధమవుతున్న సరికొత్త డిజిటల్ వేదిక
ఒకే గొడుగు కిందకు 40 అప్లికేషన్లు
న్యూఢిల్లీ : దేశంలో ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు, నిర్వహణ, ఫలితాల వెల్లడి, అభ్యర్థుల వివరాలు, ఓటర్ల నమోదు, సందేహాల నివృత్తి..
ఇలా ఎన్నికల సేవలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఒకే చోట అందుబాటులోకి తెచ్చేందుకు సరికొత్త డిజిటల్ వేదికను రూపొందించింది కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ). ఇప్పటి వరకు ఉన్న సుమారు 40 మొబైల్, వెబ్ అప్లికేషన్లను అనుసంధానం చేస్తూ త్వరలోనే 'ఈసీఐనెట్'ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఈసీఐ ఆదివారం ప్రకటించింది. ఇది అందుబాటులోకి వస్తే ఇకపై ఎన్నికల సంఘానికి సంబంధించిన వేర్వేరు యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని వివరించింది.
40 యాప్‌లతో అనుసంధానం..
ఎన్నికల సంఘం సమాచారం కోసం ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న 40 వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌ల అనుసంధానంతో 'ఈసీఐనెట్'ను రూపొందించినట్టు ఈసీఐ తెలిపింది. అఫిడవిట్ పోర్టల్, ఇండియా ఎ వెబ్, రిజల్ట్ వెబ్‌సైట్, ఎలక్షన్ 24(ఆర్కైవ్), ఈసీఐ స్వీప్, ఈసీఐ వెబ్‌సైట్, ఫెంబోసా, వాయి్‌సనెట్, మిత్ వర్సెస్ రియాలిటీ, ఎలక్షన్ ట్రెండ్స్ టీవీ, సీ విజిల్ పోర్టల్, ఈఎంఎస్, ఆర్టీఐ పోర్టల్, ఎన్కోర్, మీడియా వోచర్, సువిధ పోర్టల్, అబ్జర్వర్ పోర్టల్, ఎలక్షన్ ప్లానింగ్, ఐఈఎంఎస్, పీపీఆర్ టీఎంఎస్, ఏరోనెట్ 2.0, ఓటర్స్ సర్వీస్ పోర్టల్, సర్వీస్ ఓటర్ పోర్టల్, ఈటీపీఎంబీఎస్, ఎన్జీఎస్పీ, ఎలక్టోరల్ సెర్చ్ వెబ్ సైట్లతో పాటు ఎరోనెట్ యాప్, బీఎల్‌వో యాప్, సీవిజల్, డిసైడర్, ఎన్‌కోర్ నోడల్, ఈఎ్‌సఎంఎస్, ఇన్వెస్టిగేటర్, కేవైసీ, మానిటర్, అబ్జర్వర్, సాక్ష్యం, సువిధ, ఓటర్ టర్నౌట్ తదితర అప్లికేషన్లన్నీ ఒకే గొడుగు కిందకు రానున్నాయని ఈసీఐ వివరించింది.