రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

దోస్త్ నోటిఫికేషన్ విడుదల.. మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాలు

DOST NOTIFICATION RELEASED TELANGANA DOST NOTIFICATION 2025 DOST NOTIFICATION 2025 RELEASED DOST ONLINE APPLICATION DOST SHEDULE DOST UPDATES NEWS
Mounikadesk

దోస్త్ నోటిఫికేషన్ విడుదల.. మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాలు


• డిగ్రీలో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

• మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాలు..

• జూన్ 30 నుంచి తరగతులు ప్రారంభం..

తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీలో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదల అయింది. దోస్త్‌ నోటిఫికేషన్​ను విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. 3 విడతల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. జూన్ 30 నుంచి డిగ్రీ కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయి.

డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ, దోస్త్ నోటిఫికేషన్​ను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. మాసబ్ ట్యాంక్​లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. మొత్తం మూడు ఫేజ్​లలో డిగ్రీ సీట్లను భర్తీచేయనున్నారు. మొదటి ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల3వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. మే 3నుంచి 21 వరకు దరఖాస్తులు స్వీకరించి, మే 10 నుంచి 21వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నట్టు వివరించారు. మే 29న తొలివిడత సీట్ల కేటాయింపు చేయనున్నారు. మూడు ఫేజ్​లలో సీట్లు సాాధించిన విద్యార్థులు జూన్ 24 నుంచి జూన్ 28 లోపు వారికి సీట్ వచ్చిన కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జూన్ 30 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభం అవుతాయి.

మొదటి ఫేజ్ : -

మే 21 వరకు దరఖాస్తుల స్వీకరణ

మే 10 నుంచి మే 22 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం

మే 29 న మెుదటి ఫేజ్‌ సీట్ల కేటాయింపు

రెండో ఫేజ్‌ : -

మే 30 నుంచి జూన్ 8 వరకు దరఖాస్తుల స్వీకరణ

మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం

జూన్ 13 న రెండో ఫేజ్‌ సీట్ల కేటాయింపు

మూడో ఫేజ్‌ : -

జూన్ 13 నుంచి జూన్ 19 వరకు దరఖాస్తుల స్వీకరణ

జూన్ 13 నుంచి జూన్ 19 వరకు వెబ్ఆప్షన్లకు అవకాశం

జూన్ 23 న మూడో ఫేజ్‌ సీట్ల కేటాయింపు




Comments

-Advertisement-