రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

విజ‌య‌వాడ‌,విశాఖ‌ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ల‌కు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్న విదేశీ బ్యాంకులు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

 విజ‌య‌వాడ‌,విశాఖ‌ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ల‌కు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్న విదేశీ బ్యాంకులు.


AIIB బ్యాంకు ప్ర‌తినిధుల‌తో ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ ఎండీ రామ‌కృష్టారెడ్డి స‌మావేశం.

రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్న KFW,AFD,ADB,NDB,AIIB,

జైకా,ప్ర‌పంచ‌ బ్యాంకులు.

విజ‌య‌వాడ‌లో ప్ర‌తిపాదిత మెట్రో కారిడార్ ల‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించిన AIIB ప్రతినిధులు.

రెండు మెట్రో ప్రాజెక్ట్ ల‌కు అయ్యే వ్య‌యంలో 12000 కోట్లు రుణం అవ‌స‌రం అవుతుంద‌ని అంచ‌నా.

విశాఖ మెట్రోకు 6100 కోట్లు,విజ‌య‌వాడ మెట్రోకు 5900 కోట్లు రుణం స‌మీక‌రించాల‌ని నిర్ణ‌యం.

త‌క్కువ వ‌డ్డీకి లోన్ ఇచ్చే బ్యాంకుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న మెట్రో కార్పొరేష‌న్ ఎండీ.

త్వ‌ర‌లో కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్న విదేశీ బ్యాంకుల ప్ర‌తినిధులు.

రెండు న‌గ‌రాల్లో మెట్రో ప్రాజెక్ట్ ఏర్పాటుకు వేగంగా ముందుకు వెళ్తున్న ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ లిమిటెడ్.

అమ‌రావ‌తి...

విజ‌య‌వాడ‌,విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ల‌పై ఏపీ మెట్రోరైల్ కార్పొరేష‌న్ వేగంగా అడుగులు వేస్తోంది..రెండు మెట్రో ప్రాజెక్ట్ ల‌కు సంబంధించి ఇప్ప‌టికే జ‌న‌ర‌ల్ క‌న్స‌ల్టెంట్ ల నియామ‌కానికి టెండ‌ర్ నోటిఫికేష‌న్ జారీ చేయ‌గా...తాజాగా రుణ స‌మీక‌ర‌ణ‌పై దృష్టి సారించింది...రెండు మెట్రో ప్రాజెక్ట్ ల నిర్మాణానికి అయ్యే వ్య‌యంలో 12000 కోట్లు రుణం అవ‌స‌రం అవుతుంద‌ని అంచ‌నా వేసింది ఏపీఎంఆర్ఎల్.విజ‌య‌వాడ మెట్రో కోసం 5900 కోట్లు,విశాఖ‌ప‌ట్నం మెట్రో రైల్ కోసం 6100 కోట్లు రుణం అవ‌స‌రం అవుతుంద‌ని అంచ‌నా..ఈ నిధుల కోసం త‌క్కువ వడ్డీకి రుణాలు మంజూరుచేసే బ్యాంకుల‌తో ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ ఎండీ రామ‌కృష్ణా రెడ్డి సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు...విజ‌య‌వాడ‌,విశాఖ‌ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ల‌కు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాయి....మంగ‌ళ‌వారం సాయంత్రం AIIB బ్యాంకు ప్ర‌తినిధులు సంతోష్,పాస్క‌ల్ ర‌సెల్ తో విజ‌య‌వాడ‌లోని త‌న కార్యాల‌యంలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ ఎండీ రామ‌కృష్టారెడ్డి స‌మావేశమ‌య్యారు...అంత‌కు ముందు AIIB ప్ర‌తినిధులు విజ‌య‌వాడ‌లోని ప్ర‌తిపాదిత మెట్రో కారిడార్ ల మార్గాన్ని క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు..

పండిట్ నెహ్రూ బ‌స్ స్టేష‌న్ నుంచి గ‌న్న‌వ‌రం వ‌ర‌కూ ఉన్న 26 కిమీ కారిడార్ ను,అలాగే బ‌స్టాండ్ నుంచి పెన‌మ‌లూరు వ‌ర‌కూ ఉన్న 12 కిమీల కారిడార్ ను ప‌రిశీలించిన త‌ర్వాత రుణం ఇచ్చేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రిచారు.త్వ‌ర‌లో కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో ఈ బ్యాంకు ప్ర‌తినిధులు స‌మావేశం కానున్న‌ట్లు ఎండీ రామ‌కృష్ణా రెడ్డి తెలిపారు..మ‌రోవైపు జ‌ర్మ‌నీకి చెందిన KFW బ్యాంకుఫ్రాన్స్ కు చెందిన AFD బ్యాంకు,బీజింగ్ కేంద్రంగా ఉన్న AIIB తో పాటు జ‌పాన్ కు చెందిన జైకా బ్యాంకుల‌తో పాటు ADB,NDB,ప్ర‌పంచ బ్యాంకులు కూడా రుణం ఇచ్చేందుకు ముందుకొస్తున్న‌ట్లు ఎండీ తెలిపారు..అయితే వీటిలో త‌క్కువ వ‌డ్డీతో పాటు మెట్రో ప్రాజెక్ట్ త్వ‌ర‌గా పూర్త‌య్యేందుకు స‌హ‌క‌రించే బ్యాంకుల‌ను గుర్తించిన త‌ర్వాత మరిన్నిసార్లు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు.

Comments

-Advertisement-