రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

చాట్రాయి లో ఉత్సాహంగా తిరంగా యాత్ర

Mounikadesk

చాట్రాయి లో ఉత్సాహంగా తిరంగా యాత్ర


సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు మద్దతుగా నినదించిన చాట్రాయి

సైనికా సలాం అంటూ సాగిన తిరంగ యాత్ర

భిన్నత్వంలో ఏకత్వానికి తిరంగా ర్యాలీ ఒక చిహ్నం

రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

ఏలూరు/చాట్రాయి,మే18: దేశ సరిహద్దులో త్రివిధ దళాల సైనికులు చేస్తున్న పోరాటం, త్యాగాల వల్లే భారత భూభాగంలో మనందరం ఆనందంగా జీవిస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

ఆపరేషన్ సిందూరు కు మద్దతుగా

ఆదివారం సాయంత్రం నిర్వహించిన తిరంగా ర్యాలీలో మంత్రి కొలుసు పార్థసారథి

పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు నూజివీడు నియోజక వర్గంలోని చాట్రాయి ఎన్టీఆర్ సెంటర్ వికాస్ స్కూల్ దగ్గర నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర నిర్వహించిన తిరంగ యాత్రలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీగా ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రమూకల దాడిలో అసువులు బాసిన భారత పౌరులకు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన

అమరవీరుడు మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి ప్రార్థించారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ పెహాల్గామ్‌ ఉగ్రదాడికి వ్యతిరేకంగా, ఉగ్రవాదులను అణచడానికి, భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌ విజయోత్సవం సందర్భంగా త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. పాకిస్థాన్ ఉగ్రమూకల

పీచమణచడానికి సరిహద్దుల్లో పోరాటం సాగిస్తున్న సైనికులకు తామంతా వెన్నంటి

ఉంటామని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేసారు.

ఎంతో ధైర్యంతో భారతదేశం ముందడుగు వేసి భారతీయత చాటి ప్రజలే భారతీయత – ప్రజలే దేశమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెలుగెత్తి చాటాయన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి తిరంగా ర్యాలీ ఒక చిహ్నమని, భారతీయతకు ఇదొక నిదర్శనమన్నారు.

మన స్త్రీల నుదుటి సింధూరాన్ని చెరిపివేస్తే ఆ దుష్టముష్కరులపై ఏ రకమైన ప్రతీకారం తీర్చుకుంటామో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసి చూపించారన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ధీరత్వాన్ని మంత్రి పార్థసారథి కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆపరేషన్ సింధూర్ ఉగ్రస్థావరాలపై దాడి జరిపి భారతదేశ ప్రతిష్టను నిలబెట్టారున్నారు. తీవ్రవాదులు భారత్ పై దండెత్తితే ఆపరేషన్ సింధూర్ ద్వారా సమాధానం చెప్పిన ప్రధాన మోదీకి, ఆయనకు సహకరించిన జవాన్ లకు సెల్యూట్ అని చెప్పారు. నేడు

మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం

 సరిహద్దుల్లో ఉండి పోరాడుతున్న సైనికుల ఆత్మస్థైర్యానికి, ధైర్యానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులు తామంతా వెన్నంటే ఉంటామని స్పష్టం చేశారు. ఏపీకి చెందిన పింగళి వెంకయ్య

రూపొందించిన మువ్వన్నెల జెండా నీడలో.ముందుకు వెళ్తూ భారతమాత ఆశీస్సులతో సైనికులతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

జాతీయ జెండాను చూడగానే ప్రతి

ఒక్కరిలో దేశభక్తి, ఉద్వేగం

ఉప్పొంగుతాయని అందుకే మువ్వన్నెల జెండాను పట్టుకొని తిరంగా ర్యాలీ ద్వారా

తామంతా భారతీయులమనే నినాదాన్ని ప్రతిధ్వనించేలా నినదించాలని పిలుపునిచ్చారు.

2014 అనంతరం భారత

సైనికుల మీద దాడులు చేసినట్లయితే ఊరుకునే పరిస్థితి లేదని సర్జికల్ స్ట్రిక్,ఆపరేషన్ సింధూర్, త్రివిధ దళాల

రూపంలో పొరుగుదేశానికి ప్రధాని

మోదీ గట్టి సంకేతాన్ని, సందేశాన్నిచ్చారని తెలిపారు. పెహల్గాంలో అమాయకులైన

పౌరులని భార్యా పిల్లల ముందే

ఉగ్రవాదులు హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ

సందర్భంగా తిరంగా ర్యాలీకి తమ

సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రజలకు పేరుపేరున మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

ఈ తిరంగ యాత్రలో తహసిల్దార్ ఈశ్వర్ ఎంపిడిఓ విజయలక్ష్మి,

ఎంఈఓ బ్రహ్మచారి, ఏపిఎం వెంకటేశ్వరరావు, మందపాటి మందపాటి బస్వా రెడ్డి, మోరంపూడి శ్రీనివాసరావు మందలపు జగదీష్, బొట్టు లక్ష్మణరావు, బిజెపి నాయకులు రాజ ,అధిక సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి నాయకులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-