రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

వికసిత్ భారత్ సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

వికసిత్ భారత్ సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు


టెక్నాలజీ అభివృద్ధికి ఏపీ మార్గం

డిజిటల్ మౌలిక సదుపాయాలకు ఆదర్శంగా ఏపీ

2047 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

మోదీ ధీరత్వం, అద్భుత నాయకత్వంతో ఆపరేషన్ సిందూర్ విజయం

నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు

ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు బ్లూప్రింట్ ప్రజంటేషన్... ఇతర రాష్ట్రాలకు నమూనా అని ప్రశంసించిన ప్రధాని

ఢిల్లీ మే 24  స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పీ 4 ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు బలంగా సంకల్పించామని అన్నారు. వికసిత్ భారత్ 2047 సాకారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుందని పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వృద్ధిరేటు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, రెండవ, మూడవ శ్రేణి నగరాల అభివృద్ధి వంటి వివిధ అంశాలపై చర్చించారు. 

3వ స్థానానికి భారత ఆర్థిక వ్యవస్థ

భారతదేశం ఆర్థిక వ్యవస్థ గత పదేళ్లలో 10వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకుందని, త్వరలోనే 3వ స్థానానికి వెళ్తుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటల్ ఇండియా, జీఎస్టీ, స్టార్టప్ ఇండియా, పీఎం గతిశక్తి, జల జీవన్ మిషన్ వంటి జాతీయ సంస్కరణలు అభివృద్ధికి దోహదం చేశాయని వివరించారు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రతి కుటుంబానికి అందుతున్న లబ్దిని ఏపీ ప్రభుత్వం డిజిటల్‌గా ట్రాక్ చేస్తోందన్నార. వన్ ఫ్యామిలీ– వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమం ద్వారా నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల పెంపునకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి పారిశ్రామికవేత్త వచ్చేలా పాలసీలు తీసుకొచ్చామని, 175 నియోజకవర్గాల్లో 175 MSME పార్కులు, వన్ డిస్ట్రిక్ట్ వన్ పార్క్‌ను ప్రవేశపెడుతున్నామని సీఎం వివరించారు. 

టెక్నాలజీ అభివృద్ధికి ఏపీ మార్గం

రాష్ట్రంలో టెక్నాలజీ అభివృద్ధి చేపడుతున్న కార్యక్రమాలను కూడా సీఎం చంద్రబాబు సమావేశంలో లేవనెత్తారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, అమరావతి రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖపట్నంలో బయోమెడికల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ద్వారా టెక్నాలజీ ఆధారిత అభివృద్ధికి ఏపీ మార్గం వేస్తోందన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విశాఖపట్నంను అభివృద్ధి చేస్తున్నామని, విశాఖ మోడల్‌ను అమరావతి, తిరుపతి, కర్నూలుకు విస్తరించేలా కేంద్రం సహకరించాలని కోరారు. డిజిటల్ గవర్నన్సులో గూగుల్ ఏఐ టెక్నాలజీ వినియోగిస్తున్నామన్నారు. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్ బుక్ క్రియేట్ చేస్తున్నామని వివరించారు. టాటా ఇన్నొవేషన్ హబ్, ఎఐ ఆధారిత పాలన ద్వారా రాష్ట్రం స్టార్టప్‌లకు, ఉద్యోగ సృష్టికి మార్గదర్శకంగా మారిందని అభిప్రాయ పడ్డారు. సర్క్యులర్ ఎకానమీ, అభివృద్ధి వికేంద్రీకరణ, మిషన్ కర్మయోగి వంటి కార్యక్రమాల ద్వారా సమగ్రాభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ సాధిస్తోందని అన్నారు. 

జీడీపీ, పాపులేషన్ మేనేజ్మెంట్, టెక్నాలజీ చర్చ

రాష్ట్రాభివృద్ధికి ఉపకరించే మూడు కీలక అంశాలను గురించి సీఎం చంద్రబాబు సమావేశంలో ప్రస్తావించారు. పెట్టుబడులు, తయారీ, ఎగుమతులు, ఉద్యోగ సృష్టి వంటి అంశాలపై దృష్టి పెట్టి, పీపీపీ ప్రాజెక్టులకు కేంద్రం వయబిలిటీ గ్యాఫ్ ఫండింగ్ కు మద్దతుగా ఉండటం ద్వారా జీడీపీ వృద్ధికి దోహదపడుతుందని అన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు జనాభా లేమి సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయని, తద్వారా అభివృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. కానీ భారతదేశానికి ఉన్న జనాభా కలిసొచ్చే అంశమని అన్నారు. పాపులేషన్ మేనేజ్మెంట్ ద్వారా దేశంలో వృద్దుల శాతాన్ని తగ్గించుకునే అవకాశం ఉందన్నారు. ఈ ఉద్దేశంతోనే స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దు, మాతృత్వ సెలవులు పెంపునకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అదే విధంగా కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, డ్రోన్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు వినియోగంతో పాలనలో వేగం పెంచడమే కాకుండా, పౌర సేవలను విరివిగా అందించవచ్చని అన్నారు. 

డిజిటల్ మౌలిక సదుపాయాలకు ఏపీ ఆదర్శం

స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో జాతీయ అభివృద్ధికి దోహద పడేలా ఆదర్శంగా నిలుస్తుందని సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు పూర్తి చేసుకునే నాటికి దేశ లక్ష్యాలకు అనుగుణంగా...మార్గదర్శకత్వం వహించేలా ఏపీ ముందుండి నడవడానికి సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు.

సంక్షోభ సమయంలో ధైర్యంగా నిలిచారు

ఏప్రిల్ 22న ఫహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన అమాయకులకు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు, సాయుధ బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతమైందని కొనియాడారు. యుద్ధ వాతావరణం నెలకొన్న సంక్షోభ సమయంలో ప్రధాని మోదీ ధైర్యంగా.. నాయకత్వం వహించారని సీఎం ప్రశంసించారు. 

సీఎం చంద్రబాబు బ్లూ ప్రింట్‌పై పీఎం ప్రశంసలు

నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ బ్లూ ప్రింట్ ద్వారా సీఎం చంద్రబాబు వివరించారు. దీనిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న సంస్కరణలను అధ్యయనం చేయాలని, సీఎం చంద్రబాబు రూపొందించిన ప్రణాళిక ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. 


Comments

-Advertisement-