ఇంత పెద్ద నేత చనిపోవడం ఇదే తొలిసారి.. మావోయిస్టు అగ్రనేత కేశవరావు మృతిపై అమిత్ షా ట్వీట్..!!
ఇంత పెద్ద నేత చనిపోవడం ఇదే తొలిసారి.. మావోయిస్టు అగ్రనేత కేశవరావు మృతిపై అమిత్ షా ట్వీట్..!!
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు(Maoist) అగ్రనేత నంబాల కేశవరావు (70) అలియాస్ బసవరాజు మృతిచెందిన విషయం తెలిసిందే.
ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మొత్తం 27 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలిపారు. ఈ 27 మందిలో అగ్రనేత నంబాల కేశవరావు ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారని వెల్లడించారు.
కేశవరావుపై రూ.1.5కోట్లు రివార్డు ఉందని తెలిపారు. ఈ సందర్భంగా అమిత్ షా మరో కీలక ప్రకటన చేశారు. 2026 మార్చి 31వ తేదీ నాటికి దేశంలోనే మావోయిస్టులు అనే వారే లేకుండా చేస్తామని తెలిపారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ద్వారా ఇప్పటివరకు 84 మంది మావోయిస్టులు లొంగిపోయారని, 50 మందికి పైగా అరెస్ట్ చేశామని చెప్పారు. మావోయిస్టు పార్టీ ఉద్యమానికి నంబాళ్ల కేశవరావు వెన్నెముకగా ఉన్నారని చెప్పారు. ప్రధాన కార్యదర్శి స్థాయి నేత మరణించడం 30 ఏళ్లలో ఇదే తొలిసారి అని అన్నారు. ఎలాగైనా అంతమొందించాలనే లక్ష్యంతోనే ముందడుగు వేశామని వెల్లడించారు.