బేబీ కిట్ల పథకం పునరుద్ధరణ
బేబీ కిట్ల పథకం పునరుద్ధరణ
రూ.1,410తో 11 వస్తువుల పంపిణీ
రాష్ట్ర బడ్జెట్ నుండి ఖర్చు చేయాలన్న ప్రతిపాదనకు సిఎం ఆమోదం
గతంలో అత్యంత ప్రజాదరణ పొందిన బేబీ కిట్ ల సరఫరా పథకాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆమోదించారు. 2014-19 కాలంలో అమలైన ఈ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది.
రాష్ట్ర బడ్జెట్ నుంచే నిధుల ఏర్పాటు
గతంలో ఈ పథకానికి జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద కొంత మేరకు కేంద్ర సాయం అందేది. ఈ సాయాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. PH-ABHIM, PM మాతృత్వ వందన యోజన, 15వ ఆర్థిక కమిషన్ నిధుల కింద కూడా ఈ కిట్ ల సరఫరాకు కేంద్ర ప్రభుత్వ సాయం లభించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పథకానికి అవసరమైన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులనుంచే అందజేయాలని వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి ఆమోదించారు
నవజాత శిశువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉద్దేశించిన 11 వస్తువులతో కూడిన ప్రతి బేబీ కిట్ కు రూ.1,410లు ఖర్చవతుంది. ఈ పధకం కింద పంపిణీ చేసే వస్తువులు....దోమ తెరతో కూడిన బేబీ బెడ్, వాటర్ ప్రూఫ్ కాట్ షీట్, బేబీ డ్రెస్, వాషబుల్ నేప్కిన్స్, టవల్, బేబీ పౌడర్, బేబీ షాంపూ, బేబీ ఆయిల్, బేబీ సబ్బు, సోప్ బాక్స్ , బేబీ రాటిల్ టాయ్. రాష్రంలో జరిగి ప్రసవాల్లో సగానికి పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి