రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రేషన్‌కార్డుదారులకు నో చింత.. గడువు పెంచిన సర్కార్

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

రేషన్‌కార్డుదారులకు నో చింత.. గడువు పెంచిన సర్కార్

AP Ration Card: ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ కేవైసీ చేసుకునేందుకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది సర్కార్.

ఆంధ్రప్రదేశ్‌లో (AP) రేషన్‌కార్డు దారులకు ప్రభుత్వం (AP Govt) గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త రేషన్‌కార్డులను జారీ చేసేందుకు కసరత్తు చేపట్టిన సర్కార్.. కార్డుల జారీకి ముందు రేషన్‌కార్డుకు ఈ కేవైసీ ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందుకోసం ఓ గడువును కూడా విధించింది. ఏప్రిల్ 30 వరకు రేషన్‌ కార్డు ఈ కేవైసీ చేసుకునేందుకు గడువు విధించింది సర్కార్. అయితే ఏప్రిల్ 30 తేదీ దాటినప్పటికీ కొందరు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదు. పలు కారణాలతో ప్రజలు ఈ కేవైసీని పూర్తి చేయలేకపోయారు. ఈ క్రమంలో ఇలాంటి వారికి కోసం ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ కేవైసీనీ చేసుకునేందుకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు చేసింది. ఆ గడువు లోపు ఈకేవైసీని పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

కాగా.. బోగస్ కార్డులను ఏరివేయడంతో పాటు రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఈ కేవైసీ ప్రక్రియను తీసుకువచ్చింది ప్రభుత్వం. అందులో భాగంగానే జనవరిలోనే ఈకేవైసీపీ ప్రక్రియను ప్రారంభించింది. ఈకేవీసీ పూర్తి చేసుకునేందుకు ఏప్రిల్ 30 వరకు గడువు విధిస్తూ.. ఆలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయని పక్షంలో రేషన్ సరుకులు నిలిపివేస్తామని అధికారులు ప్రకటనలు ఇచ్చారు. రేషన్‌కార్డులు ఉన్న వారు రేషన్ డీలర్లు, ఎండీయూ వాహనాల వద్దకు వెళ్లి ఈ కేవైసీ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అలాగే ఆన్‌లైన్‌లో కూడా ఈ కేవైసీని చేసుకునే విధానాన్ని కూడా అమలులోకి తీసుకొచ్చారు. అయితే కొన్ని కారణాల వల్ల చాలా మంది ఈకేవైసీని పూర్తి చేయలేకపోయారు. అలాంటి వారి కోసమే మరో రెండు నెలల పాటు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.

కారణాలు ఇవే..

ఆన్‌లైన్‌లో ఈకేవైసీని చేసుకునేందుకే చాలా మంది ముందుకు వచ్చారు. అయితే చాలా గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లేక ఇబ్బందులు పడ్డారు. దీంతో రేషన్ డీలర్లపైనే ఆధారపడాల్సి వచ్చింది. కానీ ఈకేవైసీ చేసేందుకు కొందరు రేషన్‌ డీలర్లు డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ప్రజలు వెళ్లే సమయానికి రేషన్ షాపులు క్లోజ్ అవడం కూడా ఒక కారణమనే చెప్పుకోవచ్చు. అంతే కాకుండా చాలా మంది విద్యార్థులు వేరే ప్రాంతాల్లో ఉంటూ చదువకోవడం వల్ల కూడా వారు ఈ కేవైసీని చేసుకోలేకపోయారు. ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి రావడంతో ఈకేవైసీ చేసుకునేందుకు గడువు పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగా జూన్ 30 వరకు ఈకేవైసీ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

ప్రతీ ఒక్కరు కూడా ఈ కేవైసీ చేసుకునేలా చూస్తామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా చాలా ప్రాంతాల్లో ప్రజలు వేరే ఇళ్లకు వెళ్లిపోవడంతో వీరంతా కూడా ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంది. వీరంతా కూడా వారు ఎక్కడైతే రేషన్ తీసుకుంటారో అక్కడే ఈ కేవైసీ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జూన్ 30 లోపు ఈ కేవైసీని మీ దగ్గరలోని రేషన్ డీలర్ల వద్ద లేదా ఎండీయూ వాహనాల వద్దకు వెళ్లి పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మున్ముందు ఈ కేవైసీ ఉంటే రేషన్ సరుకులు పొందే అవకాశం ఉంటుందని.. లేకపోతే రేషన్ సరుకులు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సో.. ఇప్పటి వరకు ఈకేవైసీ చేసుకోని వారు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేసి రేషన్ సరుకులు పొందండి.

Comments

-Advertisement-