ఆరేళ్ల బాలికపై అత్యాచారాన్ని ఖండించిన మహిళా కమీషన్ ఛైర్మన్
ఆరేళ్ల బాలికపై అత్యాచారాన్ని ఖండించిన మహిళా కమీషన్ ఛైర్మన్
కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు గ్రామంలో ఆరేళ్ల బాలికపై రంగస్వామి అనే రాక్షసుడు అత్యాచారాన్ని చేయడం కలచివేసింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మానవత్వం మంటగలిసే ఇటువంటి దురాగతాలకు తావులేకుండా నిందుతలకు తగిన శిక్ష వేయాలి. ఘటనపై స్థానిక అధికారులతో సమాచారం తెలుసుకోవడం జరిగింది. నిందితుడిపై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికకు మహిళా కమీషన్ అండగా ఉంటుంది.
సరిగ్గా ఏడాది క్రితం ఇదే జిల్లాలోని హోళగుంద మండలంలో బి.హల్లీ గ్రామంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసినందుకు బోయ రంగన్న అనే వ్యక్తికి జిల్లా మహిళా స్పెషల్ సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై మహిళా కమీషన్ కొరడా ఝులిపిస్తుంది. నిందుతులు ఎంతటి వారైనా సరే చట్టం శిక్ష నుంచి తప్పించుకోలేరని
మహిళా కమీషన్ ఛైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు.