ఎంమ్మార్పీ ధర కంటే ఎక్కువకు అమ్మారు.. వినియోగదారునికి నష్టపరిహారం చెల్లించండి
ఎంమ్మార్పీ ధర కంటే ఎక్కువకు అమ్మారు.. వినియోగదారునికి నష్టపరిహారం చెల్లించండి
అనంతపురం పోస్టల్ శాఖ క్వార్టర్లలో నివసిస్తున్న జీ రమేష్ బాబు దాఖలు చేసిన రెండు వేరు వేరు ఫిర్యాదులలో వినియోగదారునికి పరిహారం చెల్లించటం తో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధికి 50000 రూపాయలు చొప్పున చెల్లించాలని వినియోగదరుల న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయటం విశేషం.
ఫిర్యాదుదారుడు జీ రమేష్ బాబు, 05.06.2023 న తన ద్విచక్ర వాహనం కోసం "టర్న్ సిగ్నల్ ల్యాంప్ " ను రామచంద్ర నగర్ లోని ఒక ప్రైవేట్ సంస్థ లో కొనుగోలు చేశాడు. ప్యాక్‌పై MRP రూ.143/- మాత్రమే (అన్నీ పన్నులతో కలిపి) ఉండగా బిల్లులో రూ.159/- వసూలు చేశారని ఫిర్యాదిదారు నిరూపించడంతో MRP కంటే ఎక్కువ వసూలు చేసిన కారణంగా
ఫిర్యాదిదారుకు అదనంగా వసూలు చేసిన రూ.16/- తిరిగి చెల్లించాలనీ మానసిక వేధింపులకు పరిహారంగా రూ.10,000/-
న్యాయ ఖర్చుల కోసం రూ.3,000/- చెల్లించాలనీ ఆదేశిస్తూ, అదనంగా జరిమానాగా రూ.50,000/-ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి చెల్లించాలనీ జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
అదేవిధంగా రామచంద్ర నగర్ లోని ఒక దుకాణ సంస్థలో కొనుగోలు చేసిన వస్తువు సంతూర్ Handwash ధర 60 రూపాయలు కాగా 68 రూపాయలు వసూలు చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. కంప్యూటర్లో నమోదైన ధరల ఆధారంగా వసూలు చేశామని, పాత కవర్ దాఖలు చేసి అక్రమ ఆర్జన కోసం అర్జీ దాఖల చేస్తున్నారని సదరు సంస్థ బదులిచ్చింది. ఆధారాలన్నీ అధిక మొత్తాన్ని వసూలు చేసినట్టు రుజువు చేయటంతో ఫిర్యాదుదారునికి వసూలు చేసిన అధిక మొత్తాన్ని తిరిగి చెల్లించడంతోపాటు 10,000/-రూపాయలు మానసిక వేదనకు, 3000/_ రూపాయలు న్యాయ ఖర్చులకు చెల్లించాలని ,అదనంగా నిర్ణయించిన ధర కన్నా అధికంగా వసూలు చేసిన నేరం కింద 50వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.
ఈ రెండు ఫిర్యాదులలోను ప్రతివాదులు ఫిర్యాదు దారుడికి నష్టపరిహారాన్ని చెల్లించినట్టుగా తెలియజేశారు
అదనంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విధించిన 50 వేల రూపాయలు ను వినియోగదారుల కమిషన్ లో డిపాజిట్ చేశారని,వెంటనే ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తామని కమిషన్ అధ్యక్షులు ఎం శ్రీలత పేర్కొన్నారు.