రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

విజన్ ఉంటేనే అభివృద్ధి

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

విజన్ ఉంటేనే అభివృద్ధి 


175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ ల స్థాపన

ఓర్వకల్లు గుట్టపాడు ఎంఎస్ఎంఈ ప్రారంభోత్సవంలో పరిశ్రమల మంత్రి టీజీ భరత్

కర్నూలు, మే 05 (పీపుల్స్ మోటివేషన్): - 

రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పిస్తామని పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు.

సోమవారం ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామం వద్ద 38.47 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఎమ్ఎస్ఎమ్ఈ పార్క్ ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ ప్రారంభించారు.

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడం అనే గొప్ప ఆలోచన దేశంలో ఎవరికి రాలేదని కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందని దాన్ని కార్యరూపంలో పెడుతున్నామని మంత్రి తెలిపారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజన్ 2020 గురించి ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు అందరు అపహస్యం చేశారని, ఆ విజన్ ఇప్పుడు హైదరాబాద్ ను చాలా అభివృద్ధి చేసిందని కావున విజన్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఒకప్పుడు 60% మార్కులు వస్తేనే ఎక్కువ అనుకునేవాళ్లు ఇప్పుడు 99% మార్కులు వస్తున్నాయి కావున సరైన శిక్షణ, చదువు ఉంటేనే ఉద్యోగాలు వస్తాయన్నారు.కావున ఈ ప్రాంతంలోని యువత కు శిక్షణ కార్యక్రమాలు నేర్పించి స్థానికులకు ఉద్యోగాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఓర్వకల్లులో పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని దానికి ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ త్వరగా మంచి సంపాదన ఉంటుందని కావున పైలట్ కోర్సులు చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ పార్కుకు అవసరమైన దూపాడు- బేతంచెర్ల రైల్వే స్లైడింగ్ కి అనుమతులు వస్తున్నాయని తెలిపారు. అనంతపురం- కర్నూలు ఇండస్ట్రియల్ జోన్ చేస్తున్నామని తెలిపారు.  

ఈ ఇండస్ట్రియల్ హబ్ కోసం ఏర్పాటు చేస్తున్న నీటి సౌకర్యం పనులు 90% పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం అని పరిశ్రమల స్థాపన కు 9 లక్షల కోట్ల రూపాయలు క్యాబినెట్ ఆమోదించిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిన మేరకు పరిశ్రమలు తీసుకుని వచ్చి 20 లక్షల ఉద్యోగాలు కచ్చితంగా కల్పిస్తామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాకుండా ఉండిన టిసిఎస్ ,ఆర్సిలర్ మిట్టల్ కంపెనీలు,14 వేల కోట్ల విలువైన సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి లోకేష్ వల ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు వస్తున్నాయని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పరిశ్రమల ప్రోత్సాహంతో తెలంగాణలో పదివేల మహిళలతో ఇప్పుడు పనిచేస్తున్న ఆ కంపెనీ మన రాష్ట్రానికి కూడా వస్తుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు... చిన్న తరహా పరిశ్రమల పార్కులు, స్టార్ట్ అప్ లు ఆ విధంగా ఎవరైతే ఎంఎస్ఎంఈ లుగా మారాలనుకుంటున్నారో వారందరికీ ఒక అవకాశం కల్పించేందుకు గాను 7 నియోజకవర్గాలలో భూమిని గుర్తించడం జరిగిందన్నారు.. ఈరోజు మొట్టమొదటిగా జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు గాను పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలంలోని గుట్టపాడు గ్రామంలో ఎమ్ఎస్ఎమ్ఈ పార్క్ ను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు... ఈ ఎమ్ఎస్ఎమ్ఈ పార్క్ 69 ప్లాట్స్ తో ప్రారంభించుకుంటున్నామన్నారు.. రానున్న 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.. ఓర్వకల్లు మండలం చాలా అభివృద్ధి చెందుతున్న మండలమని కలెక్టర్ తెలిపారు... ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ లో పైలట్ శిక్షణ కేంద్రాలను తీసుకొని వచ్చేందుకు మంత్రి వర్యులు కృషి చేస్తున్నారన్నారు... అదే విధంగా 15 ఎకరాలలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి 2 వేల కోట్ల రూపాయల తో ఇండస్ట్రియల్ నోడ్ ను అభివృద్ధి చేస్తున్నారన్నారు.. స్వయం సహాయక సంఘాలు జ్యూట్ బ్యాగ్స్, మ్యాట్స్ లాంటి తదితర వస్తువులు ఫారిన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారన్నారు.. చిన్న స్థలం కేటాయించినట్లయితే ఇండస్ట్రియల్ షాప్ లాగా పెట్టుకుంటామని అక్కడున్న మహిళలు తనను కోరారన్నారు.. ఓర్వకల్లు స్వయం సహాయక సంఘాల గ్రూప్ సభ్యులు దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు.. స్వయం సహాయక సంఘాల సభ్యులు అందరూ చిన్న స్థాయిలో పొదుపు చేసి మొదలు పెట్టారన్నారు.. ఇప్పుడు మిమ్మల్ని అందరిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే అవకాశాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చారన్నారు.. ఒక ఐదు స్వయం సహాయక సంఘాల సభ్యులకు కూడా డిపిఆర్ ను సిద్ధం చేశామన్నారు.. మొట్టమొదటి పార్క్ కేటాయింపు కూడా స్వయం సహాయక సంఘాల సభ్యులకే కేటాయిస్తామన్నారు... స్వయం సహాయక సంఘాల సభ్యుల నుండి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు.

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారన్నారు.. 2014 సంవత్సరంలో మన ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఓర్వకల్లు మండలాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు ఇండస్ట్రియల్ హబ్ గా చేశారన్నారు.. అదే విధంగా ఎయిర్పోర్ట్, డి ఆర్ డి ఓ, జయరాజ్ ఇస్పత్ స్టీల్ ప్లాంట్, సోలార్ పార్క్ లాంటి ఎన్నో పరిశ్రమలు తీసుకుని రావడం జరిగిందన్నారు. అదే విధంగా మరల ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 300 ఎకరాలలో డ్రోన్ హబ్ ను కూడా కేటాయించడం జరిగిందన్నారు. అంతే కాకుండా దేశంలో అతి తక్కువగా శాంక్షన్ అయ్యేటువంటి సెమీ కండక్టర్లను కూడా మన రాష్ట్రానికి కేటాయించడం అందులోనూ కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలానికి కేటాయించడం గర్వించదగ్గ విషయం అన్నారు. ప్రతి ఒకరిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు లక్ష్యమన్నారు.

కార్యక్రమంలో టిటిడి బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూల్ ఆర్ డి ఓ సందీప్ కుమార్, ఏపిఐఐసి జోనల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, పరిశ్రమల శాఖ జిఎం అరుణ కుమారి, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-