విధుల సమయంలో ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేసిన ఇద్దరు ప్రభుత్వ వైద్యుల నిర్వాకం
విధుల సమయంలో ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేసిన ఇద్దరు ప్రభుత్వ వైద్యుల నిర్వాకం
2022లో రోగి మృతికి కారణమైన ఈ ఘటనపై మంత్రి ఆగ్రహం
సమగ్ర విచారణకు ఆదేశం
ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల నిర్వహించాల్సిన సమయంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేసి రోగి మృతికి కారణమైన ఇద్దరు ప్రభుత్వ వైద్యులపై సమగ్ర విచారణ చేపట్టాలని వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. 2022లో జరిగిన ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మంత్రి ఇద్దరు డాక్టర్లపై క్రమశిక్షణా చర్యల్ని చేపట్టాలని స్పష్టం చేశారు. దీని ఫలితంగా గత ప్రభుత్వ హయాంలో ప్రజారోగ్య రంగంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టిన ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన వైద్య, ఆరోగ్య మంత్రి శ్రీ సత్య కుమార్ ఇద్దరు వైద్యులపై సమగ్ర విచారణ జరిపి తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం.చక్రధర్ మరియు సివిల్ అసిస్టెంట్ సర్జన్ (అనస్థీషియా) డాక్టర్ ఎస్. రాకేష్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయాల్సిన సమయంలో ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక రోగికి శస్త్రచికిత్స చేశారు. కొన్ని రోజుల తర్వాత రోగి మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగి మరణించాడని అతడి బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణకు సంబంధించి లిఖితపూర్వక వివరణ అందచేసిన వైద్యులు... తాము మానవతా దృక్పథంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేశామని, ఇందులో తమ వైపు నుండి ఎటువంటి తప్పూ లేదని వివరణ ఇచ్చారు. అంతేకాక తాము ఈ చర్యకు క్షమాపణ కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అధికారంలోకొచ్చినప్పట్నించి ప్రభుత్వ వైద్యుల హాజరీ, క్రమశిక్షణ పై దృష్టి సారించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ వారి వివరణను తిరస్కరించి కఠిన చర్యలకు ఆదేశించారు.