రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Road Accident: ఒకే ప్రాంతంలో మూడు రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి

ROAD ACCIDENT IN ONGOLE COLLISION BETWEEN LORRIES IN AP ROAD ACCIDENT FIVE PEOPLE DIED ROAD ACCIDENTS IN PRAKASAM DISTRICT Prakasam District Road Acci
Peoples Motivation

Road Accident: ఒకే ప్రాంతంలో మూడు రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి

• కొప్పోలు ఫ్లైఓవర్ సమీపంలో ఘటన..

• కోడిగుడ్ల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన వైనం..

• ఆగి ఉన్న కారును ఢీకొన్న లారీ..

ROAD ACCIDENT IN ONGOLE COLLISION BETWEEN LORRIES IN AP ROAD ACCIDENT FIVE PEOPLE DIED ROAD ACCIDENTS IN PRAKASAM DISTRICT Prakasam District Road Acci

ROAD ACCIDENT IN ONGOLE COLLISION BETWEEN LORRIES IN AP ROAD ACCIDENT FIVE PEOPLE DIED ROAD ACCIDENTS IN PRAKASAM DISTRICT Prakasam District Road Acci

ప్రకాశం జిల్లాలో దాదాపు ఒకే సమయంలో ఒకే ప్రాంతంలో మూడు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో కోడిగుడ్ల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో రమణయ్య (60), బాబు (45), నాగేంద్ర (25) మృతి చెందారు. 

అయితే బోల్తా పడిన ఈ లారీని మరో లారీ ఢీకొనడంతో పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంబించిపోయింది. ఆ ట్రాఫిక్‌లో ఆగి ఉన్న కారును వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న పావని (25), కౌశిక్ (14) మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. 

వీరు గుంటూరు జిల్లా నుంచి తిరుమలకు వెళుతున్నట్లు సమాచారం. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోడ్డు మధ్యలో బోల్తాపడిన వ్యాను, కారును క్రేన్ల ద్వారా తొలగింపజేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Comments

-Advertisement-