Road Accident: ఒకే ప్రాంతంలో మూడు రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి
Road Accident: ఒకే ప్రాంతంలో మూడు రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి
• కొప్పోలు ఫ్లైఓవర్ సమీపంలో ఘటన..
• కోడిగుడ్ల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన వైనం..
• ఆగి ఉన్న కారును ఢీకొన్న లారీ..
ప్రకాశం జిల్లాలో దాదాపు ఒకే సమయంలో ఒకే ప్రాంతంలో మూడు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో కోడిగుడ్ల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో రమణయ్య (60), బాబు (45), నాగేంద్ర (25) మృతి చెందారు.
అయితే బోల్తా పడిన ఈ లారీని మరో లారీ ఢీకొనడంతో పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంబించిపోయింది. ఆ ట్రాఫిక్‌లో ఆగి ఉన్న కారును వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న పావని (25), కౌశిక్ (14) మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు.
వీరు గుంటూరు జిల్లా నుంచి తిరుమలకు వెళుతున్నట్లు సమాచారం. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోడ్డు మధ్యలో బోల్తాపడిన వ్యాను, కారును క్రేన్ల ద్వారా తొలగింపజేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.