భారత సైనికుల సేవలకు గౌరవంగా, ఆపరేషన్ సింధూర్ అనంతరం SRIT కళాశాల నుండి రూ.10 లక్షల విరాళం
భారత సైనికుల సేవలకు గౌరవంగా, ఆపరేషన్ సింధూర్ అనంతరం SRIT కళాశాల నుండి రూ.10 లక్షల విరాళం
దేశ రక్షణ కోసం నిరంతరం ప్రాణాలను తృణప్రాయంగా భావించి సేవలందిస్తున్న భారత సైనికుల పట్ల కృతజ్ఞతగా, అనంతపురంలోని శ్రీనివాస రామానుజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (SRIT) తరఫున రూ. 10,00,000/- (పది లక్షలు రూపాయలు) విరాళాన్ని భారత సైన్యానికి అందజేశారు.
ఈ విరాళం ముఖ్యంగా ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైనికులు ప్రదర్శించిన సాహసానికి, త్యాగానికి గుర్తింపుగా అందించబడింది.
ఈ సందర్భంగా, SRIT కళాశాల ఛైర్‌పర్సన్ శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారు (మాజీ ఎమ్మెల్యే) మరియు వైస్ చైర్మన్ డాక్టర్ ఎం. రంజిత్ రెడ్డి గారు కలిసి, ఈ విరాళాన్ని హైదరాబాద్‌లోని తెలంగాణ & ఆంధ్ర సబ్ ఏరియాకు చెందిన ప్రముఖ సైనికాధికారులు బ్రిగేడియర్ నంజుందేశ్వర ఎన్.వి. గారు, కర్ణల్ వి. సురేష్ గౌడ్ గారు సమక్షంలో అందజేశారు.
ఈ సందర్భంగా పద్మావతి గారు మాట్లాడుతూ
“దేశ రక్షణ కోసం పనిచేసే ప్రతి సైనికుడికి మనం రుణపడి ఉంటాం. ఈ విరాళం మా కళాశాల తరఫున అర్పించిన ఒక చిన్న నివాళి మాత్రమే. విద్యాసంస్థలుగా మేము యువతలో దేశభక్తిని పెంపొందించాలి. మన విద్యార్థుల్లో జాతీయ స్పృహ కలిగించడమే మమ్మల్ని ముందుకు నడిపించే లక్ష్యం. ఇది కేవలం ఆర్థిక సహాయం కాదు… మనం భారత సైన్యానికి, వారి కుటుంబాలకి పక్కన నిలిచామనే భరోసా. ఈ చర్య ద్వారా యువతలో దేశపట్ల బాధ్యతను కలిగించడమే మా లక్ష్యం" అని తెలిపారు.