Tobacco: ప్రభుత్వమే బర్లీ పొగాకును కొనుగోలు చేయాలి
Tobacco: ప్రభుత్వమే బర్లీ పొగాకును కొనుగోలు చేయాలి
ప్రత్యేక ముఖ్య కార్యదర్శి (వ్యవసాయ సహకారం) బుడితి రాజశేఖర్ ఐఏఎస్ ను కోరిన పొగాకు రైతులు
బాపట్ల జిల్లా పర్చూరు మండలంలోని ఉప్పటూరు గ్రామంలో పొగాకు రైతులతో పొగాకు కోత ,ఎండబెట్టే విధానము, నిల్వ , మండి కట్టే పద్ధతులను ,వాటి అయ్యే ఖర్చులు ,తీసుకునే సమయం తదితర విషయములను *క్షేత్ర సందర్శనలో* పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులకు వివరించిన పర్చూరు శాసన సభ్యులు ఏలూరి సాంబశివ రావు
తదుపరి ఉన్నత పాఠశాలలో జరిపిన పొగాకు రైతుల సభకు పెద్ద సంఖ్యలో పాల్గొన్న రైతులు ,రైతునాయకులు* పొగాకు వ్యాపారులు ,కొనుగోలు దారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన శాసనసభ్యులు , ఉ న్నతాధికారులు .కొనుగోలు ప్రక్రియలో సమస్యల గూర్చి వాస్తవ విషయ సేకరణ , వాకబు .
పెద్ద సంఖ్యలో పాల్గొన్న నల్ల బర్లీ పొగాకు రైతులు, రైతునాయకులు సమావేశములో మాట్లాడుతూ కొనుగోలు దారులు ,వ్యాపారులు కొనుగోలు చేయటానికి ముందుకు రావటం ,విదేశాలలో ప్రస్థుత అనిస్థితి పరిస్థితుల్లో పొగాకు ఎగుమతులకు గిరాకీ లేనందువల్ల కొనుగోళ్ళు జరపటం లేదని వారు తెలియచేస్తున్నారని అధికారులకు వివరించారు .ఈ పరిస్థితులలో ప్రభుత్వం తక్షణమే స్పందించి మార్క్ ఫెడ్ ద్వారా కోనుగోలు ప్రక్రియ చేపట్టాలని కోరారు.
రాజశేఖర్ ఐఏఎస్ స్పందిస్తూ, పొగాకు వ్యాపారులులతో రేపు సచివాలయం వెలగపూడి లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ,పొగాకు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేలా వారిని ఒప్పిస్తామని తెలియచేశారు .ప్రభుత్వం రైతుల వద్ద నున్న పొగాకు సరుకును తప్పనిసరిగా వంద శాతం 100 % కొనుగోలు చేసేలా చూస్తామని ,వాటికి తగ్గ ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలియచేస్తూ ఈ విషయమై రైతులు ఎటువంటి ఆందోళనల ను చెందాల్సిన అవసరం లేదని ,రైతులను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని ప్రభుత్వం తరుపున భరోసా కల్పించారు. డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు మాట్లాడుతూ నల్ల బర్లీ పొగాకును కొనుగోలు చేయించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను తెలియచేస్తూ
రాష్ట్రంలోని నల్ల బర్లీ పొగాకు కొనుగోలు పై కంపెనీలు ఆలస్యం చేయడం, పరిమితంగా కొనుగోలు చేయడం మరియు తగిన గిట్టుబాటు ధర కల్పించలేక పోవడం వల్ల రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తగిన చర్యలు చేపట్టవలసినదిగా సంబంధిత శాఖలను ఆదేశించడం జరిగింది అని, వెంటనే వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెం నాయుడు పొగాకు కంపెనీలతో 29.04.2025 నాడు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిపారన్నారు .
ఈ కార్యక్రమంలో తీసుకున్న నిర్ణయం మేరకు పొగాకు బోర్డు కార్యాలయం, గుంటూరు నందు ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమును (ఫోను నెం 0863-2358531) ఏర్పాటు చేయడం జరిగింది అని, కావున, రైతు సోదరులు పొగాకు అమ్మకం పై ఎదురవుతున్న సమస్యలను తెలియజేస్తే ప్రభుత్వం తగు చర్యలు చేపట్టడం జరుగుతున్నదని తెలిపారు.
ఈ కంట్రోల్ రూము వారంలో 5 దినాలు ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు పనిచేయడం జరుగుతుంది. రాష్ట్రంలో సుమారు 60,000 ఎకరాలలో నల్ల బర్లీ పొగాకు ను సాగు చేయగా 65 మిలియన్ కిలోల ఉత్పత్తిని అంచనా వేయడం జరిగింది. గత 5 రోజులలో వివిధ కంపెనీలు సుమారు 232756 కిలోల నల్ల బర్లీ పొగాకు ను రైతుల వద్ద నుండి కొనుగోలు చేయడం జరిగింది అని తెలిపారు. ఈ సమావేశములో పొగాకు బోర్డు మేనేజర్ రామాంజనేయులు ,వ్యవసాయ ఉపసంచాలకులు బాలు నాయక్,బాపట్ల జిల్లా వ్యవసాయ అధికారి రామకృష్ణ ,స్థానిక రెవెన్యూ ,వ్యవసాయ అధికారులు,పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.