రూ.1 కోటి 30 లక్షలు విలువైన మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత
రూ.1 కోటి 30 లక్షలు విలువైన మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత
కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా
జిల్లా పోలీసు కార్యాలయంలో “ మొబైల్ రికవరీ మేళా ” కార్యక్రమం.
http://Kurnoolpolice.in/mobiletheft లింకును క్లిక్ చేసి , సెల్ ఫోన్లు పోగోట్టుకున్న బాధితులు ఆ మొబైల్ ఫోన్ వివరాలు నమోదు చేయండి.
• ఉచితంగా సెల్ ఫోన్ రికవరీ చేస్తాం... ఎలాంటి రుసుము లేదా ఫీజు గాని ఉండదు.
http://Kurnoolpolice.in/mobiletheft పోలీసు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
• ఒక్కరోజే 54 మొబైల్ ఫోన్లు రికవరి చేసిన కర్నూలు సబ్ డివిజన్ హెడ్ కానిస్టేబుల్ శేఖర్ బాబు కు ప్రశంసాపత్రం అందజేసిన ... అడిషనల్ ఎస్పీ
గురువారం కర్నూలు సైబర్ ల్యాబ్ పోలీసులు రికవరీ చేసిన 604 మొబైల్ ఫోన్లను కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా బాధితులకు అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ని మినీ కాన్ఫరెన్స్ హాల్లో “మొబైల్ రికవరీ మేళా” కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొబైల్ ఫోన్లు ను బాధిత ప్రజలకు అందజేశారు.
ఈ సంధర్బంగా అడిషనల్ ఎస్పీ మీడియాతో మాట్లాడారు.
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు గురువారం రోజు కర్నూలు పోలీసులు రెండవ విడతలో 604 ( విలువ రూ. 1 కోటి 30 లక్షలు) మొబైల్ ఫోన్లను రికవరీ చేశారన్నారు. ప్రజలు మొబైల్స్ పొగోట్టుకోకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. పోలీసులు సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.
తెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతాల ఓటిపిలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవ్వరికి ఇవ్వకూడదని, సైబర్ నేరాల పడకుండా ఉండాలన్నారు.
ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి రికవరీ చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్క పోలీసును, ప్రత్యేకంగా సైబర్ ల్యాబ్ పోలీసులను అభినందిస్తున్నామన్నారు.
ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగంగా ఉందన్నారు.
మొబైల్ లో మనకు సంబంధించిన పర్సనల్ వివరాలు, ఫోన్ నెంబర్లు, వ్యాపార లావా దేవిలు, అటాచ్ మెంట్స్, సెంటిమెంట్స్, ఆన్ లైన్ బ్యాంకు ఖాతా వ్యవహరాలు ఇలా చాలా మిస్ అవుతూ ఉంటారన్నారు.
ఎవరైనా మొబైల్ పోగోట్టుకుంటే వెంటనే కర్నూలు పోలీసు వెబ్ సైట్ కు http://Kurnoolpolice.in/mobiletheft వెళ్ళి పొగోట్టుకున్న మొబైల్ IME వివరాలు తెలియజేస్తే సెల్ పోన్ రికవరీ చేసేందుకు కర్నూలు పోలీసులు కృషి చేస్తారన్నారు.
ఈ పోలీసు సేవ కు ఎలాంటి రుసుము ఉండదు, ఉచితం అని , మొబైల్ పోయిన తర్వాత బాధపడడం కంటే ఆ మొబైల్ ఫోన్ పోగోట్టుకోకుండా జాగ్రత్తలు పాటించడం మంచిదని అడిషనల్ అడ్మిన్ హుస్సేన్ పీరా తెలిపారు.
సెల్ ఫోన్ పొగోట్టుకున్న బాధితులకు మొబైల్స్ రికవరీ చేసి ఇచ్చినందుకు జిల్లా ఎస్పీకి, అడిషనల్ ఎస్పీ కి, సైబర్ ల్యాబ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
1) ఎర్రి స్వామి - చిప్పగిరి .
2024 డిసెంబర్ లో నా మొబైల్ పోగొట్టుకున్నాను. యూట్యూబ్ లో చూసి కర్నూల్ పోలీసు వెబ్సైట్లో ఆన్లైన్ చేయడం జరిగింది. మొబైల్ దొరకడం చాలా ఆనందంగా ఉందని జిల్లా ఎస్పీ కి కృతజ్ఞతలు తెలిపారు.
2) రవితేజ – ఆస్పరి.
2024 అక్టోబర్ లో మొబైల్ పోయింది, పాల వ్యాపారం, ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాను. నెల రోజులు కష్టపడితే వచ్చే రూ. 15 వేలతో మొబైల్ తీసుకున్నాను. నా భార్య గర్భవతిగా ఉండిందని చాలా ఏడ్చిందని ఇప్పుడు మొబైల్ దొరకడం చాలా ఆనందంగా ఉందని జిల్లా ఎస్పీ కి కృతజ్ఞతలు తెలిపారు.
3) ముఖేష్ – ఆదోని
ఆదోని లోని ఆదిత్య నర్సింగ్ హోమ్ హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు నా మొబైల్ పోగొట్టుకున్నాను. మొబైల్ దొరకడం ఆనందంగా ఉందని జిల్లా ఎస్పీ కి కృతజ్ఞతలు తెలిపారు.
4) లింగరాజు – కర్నూలు టౌన్.
జనవరి 12వ తేదీ న గ్రౌండ్ లో ఉన్నప్పుడు మొబైల్ పోయింది. కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో బీఎడ్ చదువుతున్నాను. మొబైల్లో ఆన్లైన్ క్లాసెస్, ఎగ్జామ్స్ రాసేవాడిని. కర్నూల్ త్రీ టౌన్ లో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసి , మీ సేవలో అప్లై చేయడం జరిగింది. నా మొబైల్ దొరకడం నాకు చాలా ఆనందంగా ఉందని జిల్లా ఎస్పీ కి కృతజ్ఞతలు తెలిపారు.
5) జనార్ధన్ - కర్నూల్ .
మ్యారేజ్ బ్యూరో నడుపుతున్నాను. 20 వేల ఫోన్ నెంబర్లు నా మొబైల్ లో ఉన్నాయి. ఈఎంఐ లో నా కుమారుడు మొబైల్ కొనుగోలు చేసి ఇచ్చాడు. కర్నూల్ పోలీస్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేయడంతో ఈ మొబైల్ దొరకడం ఆనందంగా ఉందని జిల్లా ఎస్పీ కి కృతజ్ఞతలు తెలిపారు.
కర్నూలు సబ్ డివిజన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ శేఖర్ బాబు ఒక్కరోజే 54 మొబైల్ ఫోన్లు రికవరి చేసినందుకు అడిషనల్ ఎస్పీ ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కర్నూల్ ఇంచార్జి డిఎస్పి శ్రీనివాసాచారి, సిఐలు అబ్దుల్ గౌస్, నాగరాజరావు, రామయ్యనాయుడు, సైబర్ ల్యాబ్ సిఐ వేణుగోపాల్, సైబర్ ల్యాబ్ టెక్నికల్ టీం పాల్గొన్నారు.