డిగ్రీ అర్హతతో 14,582 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ పూర్తి సమాచారం
డిగ్రీ అర్హతతో 14,582 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ పూర్తి సమాచారం
స్టాప్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) పరీక్ష ప్రకటనను విడుదల చేసింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వలలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో 14,582 ఖాళీలను భర్తీ చేస్తారు.
వివిధరకాల పోస్టులు
• అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
• ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్
• ఇన్స్పెక్టర్, (సెంట్రల్ ఎక్సైజ్)
• ఇన్స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్),
• ఇన్స్పెక్టర్ (ఎగ్జామినర్),
• అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్
• ఇన్స్పెక్టర్
• సెక్షన్ హెడ్
• ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్
• రీసెర్చ్ అసిస్టెంట్
• డివిజనల్ అకౌంటెంట్
• సబ్-ఇన్ స్పెక్టర్/జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్
• జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్
• స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2
• ఆఫీస్ సూపరింటెండెంట్
• ఆడిటర్
• అకౌంటెంట్
• జూనియర్ అకౌంటెంట్
• పోస్టల్ అసిస్టెంట్ /సోర్టింగ్ అసిస్టెంట్
• సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/అప్సర్డి విజన్ క్లర్క్ లు
• సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
•ట్యాక్స్ అసిస్టెంట్
అర్హతలు
పోస్టులను అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుకు బెన్-2 స్థాయిలో గణితంలో కనీసం 60% మార్కులు లేదా డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు 01.08.2025 నాటికి అర్హత సాధిస్తే దరఖాస్తు చేయవచ్చు.
వయసు
01.08.2025 తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు విధానం
ఆన్లైన్లో https://ssc.gov.in వెబ్సైట్.
దరఖాస్తు ఫీజు
జనరల్/ఓబీసి/ ఈడబ్ల్యూఎస్ కు రూ.1000 ఎస్సీ/ ఎస్టీ/పీడబ్ల్యూబీడి/మహిళలకు/ ఈఎస్ఎంకు ఫీజు లేదు.