శ్రీకాళహస్తి ఆలయం, గాలి గోపురం నందు సుమారు 2 వేల మంది తో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం
శ్రీకాళహస్తి ఆలయం, గాలి గోపురం నందు సుమారు 2 వేల మంది తో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం
- ఉత్సాహంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికారులు, యువత, మహిళలు, విద్యార్థులు
- యోగ మన శరీరానికి మేలు చేయడంతో పాటు ఏకాగ్రత పెరగడం, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది
- ప్రతి ఒక్కరు వారి దైనందిత జీవితంలో యోగాను క్రమం తప్పకుండా కొనసాగించాలి :జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
- మానసిక ఒత్తిడిని జయించేలా ప్రతి ఒక్కరు యోగా చేయాలి : శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
- ప్రతి ఒక్కరు మానసిక ఒత్తిడి నుంచి బయట పడటానికి యోగా ను వారి జీవితంలో భాగంగా చేసుకోవాలి: బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్
శ్రీకాళహస్తి, జూన్ 18 (పీపుల్స్ మోటివేషన్):-
యోగా మన శరీరానికి మేలు చేయడంతో పాటు ఏకాగ్రత పెరగడం, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చునని ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ను క్రమం తప్పకుండా కొనసాగించాలని అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు.
బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని శ్రీకాళహస్తి ఆలయం, గాలిగోపురం దగ్గర ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవం కార్యక్రమంలో భాగంగా యోగాంధ్ర_2025 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ , శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, పర్యాటకశాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. యోగా వలన శరీరానికి మేలు చేయడంతో పాటు ఏకాగ్రత పెరగడం మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చని అప్పుడే ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యర్థంగా, జిల్లా వ్యాప్తంగా చేసుకుంటున్నాము అని యోగాంధ్రలో భాగంగా యోగా ను ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క మనిషికి చేరవేసేలాగా ముఖ్యమంత్రి గారు జిల్లా అధికారులకు ప్రజా ప్రతినిధులకు అందరికీ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. మన జిల్లాలో సుమారుగా తొమ్మిది లక్షల మంది పైగా యోగా లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి ఒక్కరికి యోగా మీద శిక్షణ ఇవ్వడం జరిగింది అని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున కూడా ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క గ్రామం, సచివాలయం పరిధిలో మండల పరిధిలో నియోజకవర్గ పరిధిలో జిల్లా స్థాయి పరిధిలో అన్ని చోట్ల కూడా 21వ తారీఖున చాలా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం చేయబోతున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని తెలిపారు. యోగా మన జీవితంలో ఒక దినచర్యలో భాగంగా అవ్వాలనీ, 21 తారీకు తర్వాత కూడా ప్రతి ఒక్క యోగాను కొనసాగించాలని అన్నారు. యోగా మన శరీరానికి మేలు చేయడం తో పాటు ఏకాగ్రత పెరుగడం, మానసిక ఒత్తిడి నుంచి ప్రశాంతత, దీర్ఘకాలిక జబ్బులను కూడా నయం చేస్తుందని తెలిపారు. కనుక ప్రతి ఒక్కరు కూడా యోగా ను మీ జీవితంలో ఒక భాగం చేసుకోవాలి యోగాoధ్రాలో భాగంగా మనం జిల్లాలో చాలా క్యాంపెయిన్స్ చేసాం అదేవిధంగా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మన జిల్లాలో రెండు ప్రదేశాలలో కూడా యోగా చేసాం అని తెలిపారు. శ్రీకాళహస్తిస్వర స్వామి చెంతన మనం ఈరోజు శ్రీకాళహస్తి పట్నంలో యోగా చేసుకుంటున్నాం ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది అని అన్నారు.
శ్రీకాళహస్తి శాసనసభ్యులు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విన్నూత ఆలోచన దిశలో ఈరోజు ఇక్కడ యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి యోగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు గిన్నిస్ బుక్ చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. జిల్లాలో 9 లక్షల పైగా యువత, యువకులు వృద్ధులు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ఈనెల 21వ తేదీ జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం కావచ్చు అని తెలిపారు. ఉరుకుల పరుగులు జీవితంలో మార్పు రావాలన్న ఆరోగ్యం బాగుండాలి అన్న యోగ అనేది తప్పనిసరి అని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒక అరగంటసేపు తమ కోసం సమయం కేటాయించి మెదడు, ఆత్మ ప్రశాంతంగా ఉండేలా ఆనందకర జీవితం గడపాలని అన్నారు.
బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమంత్రిని కూడా యోగాంధ్రలో భాగస్వామి అయ్యేలా యోగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున ప్రతి ఒక్కరు మానసిక ఒత్తిడినుంచి దూరమయ్యేలా యోగా ను వారి జీవితంలో భాగంగా చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈ ఓ బాపిరెడి, జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులు మహిళలు, విద్యార్థులు, యోగ అభ్యాసకులు తదితరులు పాల్గొన్నారు.