ఇండియన్ కోస్ట్గార్డ్లో 630 ఉద్యోగాలు చివరితేదీ ఎప్పుడంటే?
ఇండియన్ కోస్ట్గార్డ్లో 630 ఉద్యోగాలు చివరితేదీ ఎప్పుడంటే?
- భారత తీరరక్షక దళంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- అర్హత, దరఖాస్తు విధానం, జీతభత్యాలు మరిన్ని వివరాలు మీ కోసం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్న్యూస్. భారత తీరరక్షక దళంలో(ఇండియన్ కోస్ట్గార్డ్) కోస్ట్ గార్డ్ ఎన్‌రోల్డ్ పర్సనల్ టెస్ట్ (సీజీఈపీటీ)-01/ 2026 అండ్ 02/ 2026 బ్యాచ్ ద్వారా 630 నావిక్ (జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ పోస్టుల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత, దరఖాస్తువిధానం, జీతభత్యాలు తదితర వివరాలు తెలుసుకుందాం.
సీజీఈపీటీ- 01/26 బ్యాచ్ : నావిక్(జనరల్ డ్యూటీ): 260
యాంత్రిక్(మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) : 60
సీజీఈపీటీ- 02/26 బ్యాచ్:
నావిక్(జనరల్ డ్యూటీ) : 260
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) : 50
అర్హత : నావిక్ ఉద్యోగాలకు 12వ తరగతి (మ్యాథ్స్/ ఫిజిక్స్), నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులకు పదో తరగతి, యాంత్రిక్ పోస్టులకు 10వ లేదా 12వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత చెంది ఉండాలి.
వయోపరిమితి : 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.(01.08.2004 - 01.08.2008 మధ్య జన్మించి ఉండాలి).
ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు; ఓబీసీలకు 3 ఏళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
మూల వేతనం(బేసిక్ పే) : నెలకు నావిక్ ఉద్యోగానికి రూ.21,700. యాంత్రిక్ పోస్టులకు సంబంధించి రూ.29,200గా ఉంటుంది.
ఎంపిక విధానం : స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలు, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్.
పరీక్ష రుసుము : రూ.300 (ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 25.06.2025.
వెబ్‌సైట్ : https://joinindiancoastguard.cdac.in/cgept/