Air India: కూలిపోయిన విమానంలో మాజీ సీఎం తో సహా 242 మంది మృతి?
Air India: కూలిపోయిన విమానంలో మాజీ సీఎం తో సహా 242 మంది మృతి
• అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం
• లండన్ వెళుతుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిన వైనం
• విమానంలో 232 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది
• గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు అనధికారిక సమాచారం
• చరిత్రలో బోయింగ్ 787 విమానానికి ఇదే తొలి ప్రమాదం
అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది మరణించారు. ఈ జాబితాలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగిస్, ఒకరు కెనడియన్, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సైతం మరణించారు.
మరోవైపు 50 మృతదేహాలను విమాన శకలాల నుంచి వెలికి తీశారు. సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరే అన్ని విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు ప్రకటించారు.
ఇంకోవైపు ఈ విమానంలో ప్రయాణిస్తున్న గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మరణించారు. ఆయన కుమార్తె లండన్‌లో నివసిస్తుంది. ఈ నేపథ్యలంలో ఆమె వద్దకు వెళ్లేందుకు ఆయన లండన్ ప్రయాణమయ్యారు. ఇక ఆయన భార్య అంజలి రూపానీ లండన్‌లో ఉన్నారు. ఆమెను తీసుకు వచ్చేందుకు ఆయన లండన్ పయనమైనట్లు విజయ్ రూపానీ కుటుంబ సభ్యులు వివరించారు. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానంలో మొత్తం 230 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. వీరంతా ఈ ప్రమాదంలో మరణించారు.
ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు:
గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం.. టేకాఫ్ అయిన కేవలం 20 నిమిషాలకే కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో 230 మంది ప్రయాణికులు , 12 మంది సిబ్బంది మరణించారని సమాచారం. ఇందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సైతం మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ వారు, 1 కెనడియన్, 7 మంది పోర్చుగీస్ జాతీయులు ఉన్నారు. గాయపడిన వ్యక్తులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రయాణీకుల సమాచారం కోసం 1800 5691 444 అనే ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు.