ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగ ఒక భాగం కావాలి
ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగ ఒక భాగం కావాలి..
కాకినాడ మెయిన్ రోడ్డు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి ఎల్ఐసీ బిల్డింగ్ సెంటర్ వరకు సుమారు 7 వేల మందితో పెద్ద ఎత్తున యోగ కార్యక్రమం నిర్వహణ
ఉత్సాహంగా యోగ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు యువత, మహిళలు, విద్యార్థులు..
ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగ ఒక భాగం కావాలి..
జిల్లా అంతటా యోగాంధ్రకు సంబందించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహణ..
-జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగలి
వివిధ వృత్తులలో పని చేస్తున్న ప్రతి ఒక్కరు నిత్యజీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించవచ్చని జిల్లా కలెక్టర్ షన్మోహన్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన ప్రత్యేక యోగా కార్యక్రమం శనివారము కాకినాడ మెయిన్ రోడ్డు టూ టౌన్ పోలీస్ నుంచి ఎల్ఐసీ బిల్డింగ్ సెంటర్ వరకు నిర్వహించారు.
ఈ యోగ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, కర్రి పద్మశ్రీ, కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన, అడిషనల్ ఎస్పీ మానిష్ పాటిల్ దేవరాజ్, జిల్లా రెవెన్యూ అధికారి జె. వెంకట్రావు, పాడా పీడీ చైత్ర వర్షిణి, కాకినాడ ఆర్డీవోఎస్.మల్లిబాబులతో పాటు సుమారు 7 వేల మంది ఉపాధ్యాయులు హాజరై యోగాసనాలు సాధన చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలను జిల్లాలో గత నెల మే 21 నుంచి ఈ నెల 21 వరకు నిర్వహించేందుకు ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నమన్నారు. జూన్ 21న విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి ఇప్పటివరకు 8.5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు ప్రకారం జిల్లాలో శనివారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాల ఉపాధ్యాయులతో భారీ స్థాయిలో యోగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా సుమారుగా 7 వేల మంది హాజరయ్యారని ఆయన తెలిపారు. ఈ యోగ సాధన కేవలం అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు వరకు మాత్రమే పరిమితం కాకుండా నిత్య జీవితాల్లో యోగాను ఒక భాగం చేసుకోవాలన్నారు. యోగాను రోజు సాధన చేయడం ద్వారా మానసిక ప్రశాంతతతోపాటు వివిధ వృత్తుల్లో పనిచేస్తున్న వారు మరింత సమర్థతతో విధులు నిర్వర్తించేందుకు యోగ దోహద పడుతుందని ఆయన తెలిపారు.
జిల్లా అంతటా ఈ యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతొందని తెలిపారు. జూన్ 21న జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో యోగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలను, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసుకుని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ రోజు జరిగిన యోగా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులను ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ జిల్లా అధికార యంత్రాంగానికి పూర్తి సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కోరారు.
ఎమ్మెల్సీ పేరా బత్తుల రాజశేఖరం మాట్లాడుతూ..మే 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంల్లో భాగస్వామ్యం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్క పౌరుడికి ఆరోగ్యం చాలా అవసరమని, నిత్యం వివిధ రకాల మందులు వాడుతూ ఆరోగ్యం పాడు చేసుకోకుండా యోగ సాధన చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని తెలిపారు. గౌరవ దేశ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో దృఢ సంకల్పంతో యోగ కార్యక్రమాలు నిర్వహించుకోవడం శుభ పరిణామని ఆయన తెలిపారు. యోగ ఆంధ్ర కార్యక్రమాలను జిల్లాలో అత్యంత ప్రతిష్టంగా నిర్వహిస్తున్న జిల్లా అధికార యంత్రాంగాన్ని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం అభినందనలు తెలియజేశారు.
ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర మంతట పండుగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి.. పరిశుభ్రత, పచ్చదనం వంటి కార్యక్రమాలతో పాటు అందరి ఆరోగ్యంపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తు యోగాంధ్ర కార్యక్రమం కార్యక్రమాన్ని ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తున్నారని ఆమె తెలిపారు. ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో యోగాకు ప్రత్యేక స్థానం ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ గుర్తు చేశారు. మన పూర్వీకులు యోగాను సాధన చేయడం ద్వారానే ప్రశాంతమైన జీవనాన్ని గడిపారన్నారు. వారందరినీ స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా యోగా సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె తెలిపారు.
కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగ డే సందర్భంగా మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా గురించి గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలనేది గౌరవ ముఖ్యమంత్రి ఉద్దేశమని ఆయన తెలిపారు. రోజువారి దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరు మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారని దాని నుంచి బయటపడడానికి యోగ తప్పనిసరి అన్నారు. రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలుగా చేస్తున్న యోగవల్ల 80 సంవత్సరాలు అయిన కూడా ఇంకా ఎంతో ఎనర్జిటిక్ గా పనిచేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షకులు రామానంద అందరిచేత ప్రజలు, అధికారులు, యువత మహిళలతో ఆసనాలు సాధన చేయించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఆయుష్ వైద్య అధికారి అలీ ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.