రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మహిళల భద్రతకు "శక్తి" యాప్ ఓ రక్షణ కవచం..

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

మహిళల భద్రతకు "శక్తి" యాప్ ఓ రక్షణ కవచం..

  •  జిల్లా వ్యాప్తంగా విద్యార్దులకు, ప్రజలకు శక్తి యాప్ గురించి విస్తృతంగా అవగాహన..

జిల్లా ఎస్పీ శ్రీ. వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు, పాఠశాలలు, కళాశాలల్లో శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమాలు..

జిల్లా వ్యాప్తంగా మహిళల భద్రతకు శక్తి యాప్ ద్వారా శక్తి టీం బృందాలు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడంతో శక్తి యాప్ యొక్క ఆవశ్యకత ప్రాధాన్యత శక్తి యాప్ ద్వారా అందించే సేవలను విద్యార్థినీలకు అవగాహన కల్పిస్తున్నారు. మహిళల భద్రతకు శక్తి యాప్ ఓ రక్షణ కవచం అని తెలియజేశారు. గురువారం జిల్లాలోని పలు పాఠశాలలు ,జూనియర్ కళాశాలల్లో, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్ లు, అంగన్వాడీ కేంద్రాలు ఇతర రద్దీ ప్రదేశాలలో, జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాలతో, శక్తి టీమ్ సిబ్బంది విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల విద్యార్థులకు రక్షణ భద్రత ఉంటుందని ప్రతి ఒక్కరు శక్తి యాప్ ను ఫోన్లో నిక్షిప్తం చేసుకుని రిజిస్ట్రేషన్ కావాలని శక్తి బృందాలు తెలియజేశారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా శక్తి యాప్ ద్వారా 100,112 మరియు SOS బటన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అని, పోలీసు సేవలను మహిళలకు మరింత చేరువ చేసేందుకు "శక్తి" వాట్సప్ నెంబర్ 7993485111 ను కూడా అందుబాటులోకి తేవడం జరిగిందని తెలియజేశారు. మహిళలకు ఆపద సమయంలో అత్యవసర సాయం అందించేందుకు శక్తి యాప్ ఒక అయధం గా పనిచేస్తుందన్నారు. కావున ప్రతి ఒక్క మహిళ, విద్యార్థులు మొబైల్ లో శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.

Comments

-Advertisement-